మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కారును అడ్డుకున్న కూటమి నేతలు
2 May, 2025 14:50 IST
కాకినాడ జిల్లా: పెదపూడి మండలం దోమడలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కారుని కూటమి నేతలు అడ్డగించారు. వారం రోజుల క్రితం 8 ఇల్లు ఆక్రమణలో ఉన్నాయని అధికారులు కూల్చివేశారు. బాధితుల పరామర్శించి సహాయం అందించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కారును కూటమి నేతలు అడ్డగించి దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కారుకు రక్షణగా ఇళ్ళు కూల్చివేత బాధితులు, మహిళలు నిలిచి కూటమి నేతల దాడిని తిప్పికొట్టారు. తమకు అండగా ఉండేందుకు వచ్చిన నాయకుడిపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని బాధిత కుటుంబాలు హెచ్చరించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సురక్షితంగా ఇంటికి చేరారు.