ఎల్లుండి సీఎం వైయస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడు పర్యటన
15 Nov, 2023 22:32 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (17.11.2023) ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు.
2003కు ముందు అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నూజివీడు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగం అనంతరం 2003కు మందు అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు