15 టీడీపీ కుటుంబాలు వైయస్ఆర్ సీపీలో చేరిక
నెల్లూరు జిల్లా: రూరల్ నియోజకవర్గంలోని 41వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన 15 ముస్లిం మైనారిటీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో సీనియర్ ముస్లిం మైనారిటీ నాయకులు మునీర్ సిద్దిక్ ఆధ్వర్యంలో టిడిపి చెందిన సుఫియాన్, అస్లాం, జావీద్, సబిల్, జాకీర్, వసీం, ఇబ్రహీం తదితరులతోపాటు వారి మిత్రబృందం ఆ పార్టీని వీడి స్వచ్ఛందంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిడిపిని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరెందుకు ముందుకు వచ్చిన వారందరినీ పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో వారందరికీ అన్ని విధాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించడంతోపాటు పార్టీలో వారికి సముచితమైన ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని, వారికి ఎటువంటి కష్టమొచ్చిన అన్నివిధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ ఖాజావలి,ఇక్బాల్, నాగ శ్రీనివాసులు రెడ్డి 41వ డివిజన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.