పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
23 Apr, 2024 11:38 IST
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రకు పీఎం పాలెం ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైన 21వ రోజు బస్సు కొద్దిసేపటి క్రితం పీఎంపాలెం చేరుకుంది. జననేతకు స్వాగతం పలికేందుకు ప్రజలు, వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమాన నేతకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. పీఎంపాలెం వద్ద రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం వైయస్ జగన్ ముందుకు కదిలారు. మీవెంటే మేమంతా అని నినాదాలు చేస్తూ బస్సుయాత్ర వెంట జనం కదిలారు.