వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలు
24 Apr, 2024 12:16 IST
శ్రీకాకుళం: ఎచ్చర్ల నియోజకవర్గం టీడీపీ కీలక నేతలు వైయస్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్‌లో వైయస్ఆర్ సీపీలో చేరారు. అదే విధంగా ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు.