22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 22వ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్రారంభమైంది. అక్కివలస నైట్ స్టే పాయింట్ నుంచి భారీ జనసందోహం మధ్య ప్రారంభమైన వైయస్ జగన్ బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితమే చిలకపాలెం మీదుగా ఎచ్చర్లకు చేరుకుంది. ఎచ్చెర్లలో సీఎం వైయస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 22వ రోజు బస్సు యాత్ర ఎచ్చెర్ల మీదుగా కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు బయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు.