ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
భీమవరం: వైయస్ జగన్ ఒంటరి కాదు.. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ప్రతీ ఇంట్లో సైన్యం ఉందని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే జగనే ఉండాలి.. జగనే కావాలి.. జగనే రావాలి అని ఈరోజు ప్రతీ ఇంట్లో కూడా మద్దతు తెలిపే వారున్నారని చెప్పారు. జగన్‌కు కోట్లాది మంది సైన్యం ఉందని ఉద్ఘాటించారు. సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైయస్ జగన్‌ది పేదలపక్షమని.. తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు..
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే..
భీమవరం- ఉప్పొంగిన అభిమాన సంద్రం.*
భీమవరంలో ఈ రోజు జనసముద్రం కనిపిస్తోంది. శబరి, ఇంద్రావతి రెండు నదులు కలిసిన గోదావరి ఉప్పొంగి...నది కాస్తా సముద్రమైతే ఎలా ఉంటుందో ఈ రోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ప్రజల అభిమానం అలా ఓ సముద్రమై కనిపిస్తోంది. ఇంతటి అభిమానాలు, అప్యాయతలు చూపిస్తూ ఈ రోజు ఇక్కడకి వచ్చిన నా ప్రతీ అక్కకు, చెల్లమ్మకు, అవ్వాతాతకు, సోదరుడికి, స్నేహితుడికి రెండు చేతులు జోడించి ప్రేమ పూర్వక కృతజ్జతలు తెలుపుకుంటున్నాను.
*పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరు సిద్ధమా?*
మంచి చేసి మనం.. జెండాలు జత కట్టి వారు తలబడపోతున్న ఈ ఎన్నికల్లో పేదల వ్యతేరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి మంచిని, సంక్షేమాన్ని కాపాడుకునేందుకు, జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా... పేదల రాజ్యాన్ని.. అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో మోసాలతో కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది. అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా?.
*రాబోయే ఎన్నికలు మన తలరాతను మార్చేవి*
జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేది కాదు.. ఈ ఎన్నికల్లో ఓటు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తు, మీ పిల్లల బడులు, వారి చదవులు, అక్కచెల్లమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నల భరోసా, పేదల న్యాయం.. ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా.. లేదంటే నష్టపోవాలా అన్నది నిర్ణయించేది ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు మన తల రాతులను మార్చేవన్నది గుర్తెరగాలి. ఈ ఎన్నికలు కేవలం చంద్రబాబు, జగన్ కు మాత్రమే జరుగుతున్నవి కాదు.. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో మీ బిడ్డది పేదల పక్షం.. కాబట్టి మీ ప్రతీ ఓటు.. మీకు మీరుగా, మీ కుటుంబమంతా.. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకొండి. మీ బిడ్డ జగన్ కు ఓటు వేస్తే పథకాలు అన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ మునిగిపోతాయి. మళ్లీ మోసపోవడం.. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో వచ్చే వాస్తవం. ఎవరికి ఓటు వేస్తున్నాము... ఆ ఓటు వల్ల మంచి జరుగుతుందా లేదా అన్నది ఆలోచించి అడుగు ముందుకు వేయాలి.
*బాబుది చెరువులో కొంగలాంటి దొంగ జపం.*
ఈ మధ్య చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడుకు నా మీద కోపం ఎక్కువగా వస్తోంది.. ఆయన మాట్లాడేటప్పుడు హై బీపీ వస్తోంది.. నాకు శాపనార్థాలు పెడుతుంటాడు. ఏదో అయిపోవాలి.. రాళ్లు వేయండి.. అంతం చేయండి అని పిలుపునిస్తుంటాడు ఈ పెద్ద మనిషి,. నా మీద ఎందుకు అంత కోపం అంటే ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను చంద్రబాబును అడకూడని ప్రశ్న అడిగాను. అది ఏమిటంటే.. బాబు.. బాబూ.. చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ.. ఇంకో వైపు కొంగ జపం చేస్తున్నట్లుగా ఎందుకు నటిస్తావు అని అడిగాను.
*బాబు పేరు చెబితే దగా, మోసం, వెన్నుపోటు గుర్తొస్తాయి.*
నీ పేరు చెబితే గుర్తుకు వచ్చే మచ్చి ఒక్కటైనా ఉందా అని అడిగి.. చంద్రబాబు పేరు చెబితే జరిగిన మంచి ఒక్కటి గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే వెన్నపోటు. దగా మోసం.. కుట్రలు మాత్రమే ఎవరికైనా గుర్తుకు వస్తాయి.
*దత్తపుత్రా ఆడవాళ్లను చులకనగా చూపించడం తప్పుకాదా?*
అదే మాదిరిగా.. దత్త పుత్రా.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి.. పిల్లలు పుట్టిచ్చి..పెళ్లి కాగానే నాలుగేళ్లకొకసారి, ఐదేళ్లకొకసారి భార్యలను వదిలేసి, ఇప్పుడు నియోజకవర్గాలను కూడా అలవోకగా వదిలేస్తున్నావు... ఏం మనిషి వయ్యా అని అడిగా.. అందుకే దత్తపుత్రుతుడులో కూడా బీపీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కసారి చేస్తే పొరపాటు, మళ్లీ ..మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారు.
దత్తపుత్రా.. పవిత్రమైన సంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకు తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపించడం ఘరోమైన తప్పు కాదా.. నేను అడిగితే తప్పట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతీ ఒక్కరూ మొదలు పెడితే.. ఇలా నాలుగైదేళ్లకు అక్కచెల్లెమ్మల బ్రతుకులేం కావాలి.. ఇలా అడిగితే చాలు ఆ పెద్ద మనిషిలో బీపీ పెరిగిపోతోంది. కాళ్లూచేతులు, తల ఊపేస్తూ ఉగిపోతుంటాడు. ఆయన బీపీని తట్టుకోలేం. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు, పవన్ కు, చంద్రబాబు వదినకు, బాబు భజంత్రీలకు కూడా కోపం వస్తుంది. వీళ్లంతా కూడా ఊగిపోతూ ఉంటారు.
*మీరు గమనించే ఉంటారు.*
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లో వార్తలు చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే.. పూనకం వచ్చినట్లు రాస్తారు. ఈ వర్గాలన్నింటినీ కూడా ఎందుకు కోపం వస్తోందంటే కారణం... ఈ పేదలను, నా అక్కచెల్లెమ్మలను, సామాజికవర్గాలను, పిల్లలను, అవ్వాతాతలను, రైతన్నలను.. నువ్వెలా ముంచావో చెప్పడానికి బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి చంద్రబాబు.
చంద్రబాబు చేసిన మంచి చెప్పడానికి ఏమీ కనపడవు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఏనాడూ ఉపయోగించలేదు.
*75 ఏళ్ల వయసులో కూడా మోసాలు, అబద్దాలనే నమ్ముకున్న బాబు.*
75 ఏళ్ల వయసులో కూడా అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేయాల్సి వస్తోంది. 14 ఏళ్లు సీఎంగా చేసినా సరే చంద్రబాబు పేరు చెబితే ఏ మంచీ గుర్తుకు రాదు. జగన్ అన్ని వర్గాలకు మంచి చేసాడు కాబట్టే.. ఈ పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్ కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ తో పాటుగా కుట్రలు, మోసాలు, ఇతర పార్టీల్లో బాబు పెట్టుకున్న కోవర్డులు, వ్యవస్థల్లో ఉన్న ఆయన మనుషులు ఈ ఒక్క జగన్ మీద దండయాత్రలు చేస్తున్నారు.
*జగన్ ఒక్కడు.. బాబుకు పదిమంది సేనానిలు* వారంతా బాణాలు పట్టుకుని గురిపెట్టుకుని ఉన్నారు. వారి బాణాలు తగిలేది ఎవరికి.. జగన్ కా .. జగన్ పథకాలు ఇచ్చే పేదలకా అన్నది ఆలోచించాలి. ఆ బాణాలు తగిలేది జగన్ కా.... వాలంటీర్ వ్యవస్థలకా.. ఆర్బీకేలకా.. వారి బాణాలు తగిలేది అవ్వాతాతలకా.. వారి బాణాలు తగిలేది.. రైతు భరోసాకా?
వారు వేస్తున్న బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? లేక అక్కచెల్లెమ్మల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి కుటుంబాలు బాగుపడాలని, మహిళా సాధికారతకు అర్ధం చెబుతూ.. రకరకాల పథకాలతో మీ బిడ్డ, మీ జగన్ బటన్ నొక్కడం ద్వారా వారి ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు పంపించాడు.
*ఆలోచించండి.*
వారు బాణాలు ఎక్కుపెట్టినది.. మీ భవిష్యత్తు కోసం, నేను తీసుకువచ్చిన పథకాలు, వ్యవస్థల మీద ఎక్కు పెడుతున్నారు. ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులు, పార్టీల మధ్య కాదు.. పేద పిల్లల బంగారు భవిష్యత్, రైతన్న రైతు భరోసా, అవ్వాతాతల సంక్షేమహిళా సాధికారత మీద చంద్రబాబు ఆయన పెత్తందారులు ప్రకటించిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో తలబటడానికి మీరంతా సిద్ధమేనా.
*జగన్‌కు తోడుగా పేదల సైన్యం.*
జగన్ ఒంటరి కాదు.. మంచి చేసిన జగన్ కు మద్దతుగా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది. ప్రతీ ఇంట్లోనూ జగన్ కు తోడుగా జగన్ ఉండాలి.. జగనే రావాలి అని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ కోట్ల మంది కోరుకుంటున్నారు. రూ. 3 వేల పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతాలు, ఆమ్మఒడి నుంచి వసతి దీవెన వరకు పథకాలు అందుకుంటున్న అక్కాచెల్లెమ్మలు కోరుకుంటున్నారు. నా అన్నే.. నా తమ్ముడే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు.
బాగుపడిన ఆసుపత్రులు, విలేజ్ క్లీనిక్ లు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో మెరుగైన పేదల బ్రతుకులు, ఆరోగ్యం బాగోలేకపోతే, మనసున్న వ్యక్తి, మాకు తోడున్న వ్యక్తి జగన్ అని ఆలోచన చేసే ప్రతీ పేదవాడు మీ బిడ్డకు తోడుగా ఉన్నాడు.
బాగుపడిన గవర్నమెంట్ బడులు, ఇంగ్లీషు మీడియం చదువులు, కోరుకున్న పిల్లలు, తల్లితండ్రులు తోడుగా ఉన్నారు. జగన్ ఉంటేనే స్కూల్స్, చదువులు, అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడే స్థాయి వస్తుందని అందరూ కోరుకుంటున్నారు. మా మామే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని ప్రతీ పిల్లవాడు కోరుకుంటున్నాడు.
రైతన్నను ప్రతీ అంశంలో కూడా చేయి పట్టుకుని నడిపిస్తుండటంతో రైతాంగం జగన్ ఉంటేనే రైతు భరోసా, గ్రామాల్లో ఆర్బీకే పని చేస్తుంది.
దళారీలు లేకుండా పంట అమ్ముకునే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు. రైతన్నలంతా జగనే రావాలి.. జగన్ నే కావాలని జగన్ కు మనసు ఉంది.. జగన్ మాత్రమే మంచి చేయగలడని మీ బిడ్డకు తోడుగా ఉన్నారు.
*జగన్ ఎప్పుడూ ఒంటరి కానే కాదు.*
ఎప్పుడూ జరగని విధంగా ప్రతీ అంశంలో కూడా నా అట్టుడుగున ఉన్న అణగారి వర్గాలు జగన్ కే తోడుగా ఉన్నారు.. మంచి జరిగింది కాబట్టే పేదల గుండెల్లో పెట్టుకున్నారు. మంచి జరిగిన ప్రతీ ఇంటి నుంచి జగన్ కు అండగా వారికి బిడ్డగా, తోడుగా ఇంతమంది. జగన్ కు అండగా ఉన్నారు.. అందుకే అడుగుతున్నాను. జగన్ ఒంటరా.. కానే కాదు... జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.. ఇన్ని కోట్లు గుండెలు జగన్ కు తోడుగా ఉన్నంతవరకు జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.
*రొయ్యికి మీసం- బాబుకు మోసం పుట్టుకతో వచ్చాయి.*
మరి మోసం చేసే చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందంటే, రొయ్యికి మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో.. ఈ భీమవరం లో తేల్చాద్దామా.
*58 నెలల ఇంటింటి అభివృద్ధే మన ప్రొగ్రస్ కార్డు.*
58 నెలల మన పాలనలో, ఇంటింటి అభివృద్ధి మన ప్రొగ్రెస్ కార్డు అయితే. అందరినీ మోసం చేయడం.. నట్టేట ముంచడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. బాబు వస్తే జాబు రావడం కాదు. ఉన్నవి ఎలా ఊడిపోతాయో.. రైతులను ఎలా ముంచాడో పిడుగరాళ్ల సభలో మీ ముందు ఉంచాను.
ఈ సభలో ఈ టీడీపీ, ఎల్లో మీడియా కలసి చంద్రబాబును జాకీలతో ఎత్తి, ప్రొక్లెయినర్ తో ఎత్తిన పచ్చి అబద్ధాలను ఈరోజు తేల్చుదామా.
*ఇక వారు చేస్తున్న మరో ప్రచారం.. అందులో నిజాల్ని చూద్దాం.*
చంద్రబాబుపై, ఎల్లోమీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్ ఏంటో తెలుసా?
చంద్రబాబు పేదలకు రైతులకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, గ్రామానికి చేసినది ఏమీ లేదు కాబట్టి.. అయినా కూడా తమ బాబు గొప్పవాడు అని నమ్మించాలంటే ఏం చేయాలని ఆలోచించి.. బాబు వల్లే అభివృద్ధి అని తరుచూ జాకీలు పెట్టి ఎత్తుతూ ఉంటారు. ఆ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా.. ఖాళీ డబ్బాలో నాలుగు రాళ్లు వేసి ఊపితే ఎలా శబ్ధం వస్తుందో.. అలా ఉంటుంది.
*బాబుకి- అభివృద్ధికి సంబంధం ఉందా?*
చంద్రబాబుకు, అభివృద్ధికి సంబంధం ఉందో లేదో.. మీరే చెప్పండి. సెల్ ఫోన్ కనిపెట్టింది.. ఐటీ తీసుకువచ్చింది.. సత్య నాదెళ్లని చదివించినది తానే అని చెప్పినవి పక్కన పెడదాం.
తాజాగా కంటికి కనిపిస్తున్నవి మాత్రమే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019 ఎన్నికలే తీసుకుందాం.
*కొత్తరాష్ట్రం.. అసలే అన్యాయం జరిగింది.*
కొత్త రాష్ట్రం రాజధాని కూడా లేదు. ఇలాంటి సమయంలో బాబు వంటి గొప్ప అనుభవజ్డుడు రావాలి .. ఆయన వస్తేనే అంధ్ర అభివృద్ధి అని చెవుల్లో ఊదరగొట్టారు. జగన్ కు అనుభవం లేదు.. చంద్రబాబుకు బాగా అనుభవం ఉందని చెప్పారా.. లేదా.. ఈ చంద్రబాబు నాయుడు కూడా బహిరంగంగా అన్నాడా లేదా.. అదిగో హైపర్ లూప్ అని , అదిగో బుల్లెట్ రైల్, మైక్రోసాప్ట్, ఇదిగో ఒలంపిక్స్ జరిపించేస్తానని, అమష్టర్‌డామ్, సింగపూర్. వెనిస్ నగరాలతో పోటీ పడే నగరాన్ని నిర్మించేస్తామని చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడా.. లేదా?. అవునా.. కాదా. ఇన్ని అబద్ధాల తర్వాత అభివృద్ధి జరిగిందా.. సింగపూర్ కట్టాడా.. హైపర్ లూప్ కట్టాడా.... బుల్లెట్ రైలు వచ్చిందా.. మైక్రోసాఫ్ట్ తెచ్చాడా.. రాష్ట్రంలో ఒలంపిక్స్ జరిగాయా.. కొత్తగా పోర్టులు కట్టాడా.. ఫిషింగ్ హార్బర్ లు, ఎయిర్ పోర్టులు కట్టాడా.. ప్రతీ జిల్లాలోనూ హైటెక్ సిటీ అన్నాడు.. ఎక్కడైనా కనిపించాయా.. పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజీ కట్టాడా... చంద్రబాబు కట్టకపోతే పోయే.. కనీసం ఏ గ్రామంలోనైనా, ఏ ప్రభుత్వ స్కూల్, ఆసుపత్రినైనా బాగు చేసాడా.. పోనీ ఎక్కడైనా ఒక గ్రామ సచివాలయమైనా కట్టాడా.. ఒక వాలంటీర్ వ్యవస్థనైనా తీసుకువచ్చాడా.. వాలంటీర్ ఏ రోజైనా వచ్చి మీ తలుపు తట్టాడా.. ఏ గ్రామంలోనైనా విలేజ్ క్లీనిక్ కట్టాడా.. ఫ్యామిలీ డాక్టర్ తెచ్చాడా.. ఆరోగ్య సురక్షను మీ ఇంటి వద్దకు తెచ్చాడా.. గ్రామానికి ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీ, మారుమూల గ్రామానికి కనెక్టవిటీ తెచ్చాడా.. ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చాడా.. అప్పట్లో మీ గ్రామాల్లో కనిపించాయా.. మరి ఇలాంటి బాబు ఏం చేసాడని ఆయన అభివృద్ధి కింగ్... ఇది బోగస్ రిపోర్టు కాదా.
*మరి మీ జగన్ ప్రొగ్రెస్ రిపోర్టు చూద్దామా.*
ఈ 58 నెలల్లో 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు వాయువేగంతో పనులు జరుగుతున్నాయి. కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్ లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు జరుగుతున్నాయి. ఈ 58 నెలల కాలంలో 26 జిల్లాలకు రాష్ట్రం విస్తరించింది. 15వేల గ్రామ సచివాలయాలు, నాడు నేడుతో బాగుపడ్డ స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, క్లీనిక్ లు కనిపిస్తున్నాయి.
*దేశంలో టాప్ 5 రాష్ట్రంలో ఉన్నాం.*
కొత్తగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు, 3 వేలకు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. గ్రామాలకి ఫైబర్ గ్రిడ్. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా భోగాపుపరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, ఎంఎస్ ఎం ఈలకు ఆపన్న హస్తం ఇస్తున్నది మీ జగనన్న ప్రభుత్వం. ఏ రాష్ట్రమైన బాగుపడాలంటే స్వయం ఉపాధి రంగం బాగుపడాలి.
ఆ రంగానికి ప్రొత్సాహం ఇస్తూ ఆసరా, చేయూత కాపు నేస్తం, ఈ బీసీ నేస్తం, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం. .. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టే దేశంలో టాప్ 5 రాష్ట్రాల్లో మనది కూడా ఉంది. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పాలన కళ్ల ఎదుటే కనిపిస్తోందా.. లేదా.. గతంలో జరిగిందేంటి.. మరుగుదొడ్లు, సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచం.. ఇవాళ ఎక్కడైనా లంచాలు, వివక్ష ఉందా.. ఈ పాలన తీసీకువచ్చింది మీ బిడ్డ కాదా.. బాబు వస్తేనే అభివృద్ధి అనేది బోగస్ రిపోర్టు కాదా.. జగన్ చేసినది ప్రొగ్రెస్ రికార్డు కాదా అని అడుగుతున్నాను. మభ్యపెట్టిన వాడిని ఏమి అంటాం.. చీటర్ .. మోసగాడు.. మాయలోడు అంటాం. కానీ ఐదేళ్ల క్రితం మనం ఆ మనిషిని ముఖ్యమంత్రి అన్నాం. ఆలోచన చేయండి.
*ఈ చంద్రబాబు చరిత్రను ప్రతీ ఒక్కరికీ వివరించండి.*
బాబు కూటమి ఏం చేసింది.. వారి చరిత్ర ఏమిటీ అన్నిది ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి. 2014లో ఇదే చంద్రబాబు, ఇదే కూటమిగా ఏర్పడి చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ గారి ఫోటో వేసుకుని ముఖ్యమైన హామీలంటూ పాంఫ్లెట్ కింద బాబు సంతకం చేసాడు.
*చంద్రబాబు విఫలహామీలు*
రైతు రుణ మాఫీ పై తొలి సంతకం అన్నాడు. రూ. 87,612 కోట్ల రైతన్నల రుణాలు మాఫీ అయ్యాయా... రెండోది.. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు అన్నాడు.. చేసాడా?
రూ. 14,205 కోట్లలో కనీసం ఒక్క రూపాయైనా చేసాడా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25 వేల బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేసాడా. ఒక్క రూపాయైనా చేసాడా?
ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే రూ. 2 వేల నిరుద్యోగ భృతి... అంటే లక్షా ఇరవై వేల రూపాయలు ఒక్కో ఇంటికి ఇచ్చాడా.. అర్హులైన వారందరికీ మూడు సెంట్లు స్థలం అన్నాడు.. కనీసం ఒక్క సెంటైనా ఇచ్చాడా.. పది వేల కోట్లతో బీసీల సబ్ ప్లాన్ అన్నాడు.. చేనేత, పవర్ లూమ్స్ రూణాల మాఫీ చేసాడా.. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు, సింగపూర్ స్థాయిలో అభివృద్ధి, ప్రతీ నగరంలో హైటెక్ సిటీ అన్నాడు.. మీ బీమవరంలో కనిపిస్తోందా... కనిపించడం లేదు కదా.. మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలంటూ ఈయన సంతకం పెట్టి ముగ్గురు ఫొటోలు పెట్టి.. చెప్పిన వాటిలో ఒక్కటంటే ఒక్కటైనా చేసాడా.. ప్రత్యేక హోదా ఇచ్చాడా.. మరి ఇవ్వకపోగా మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గురు.. చంద్రబాబు కొత్త మ్యానిఫెస్టోలో సూపర్స్ సిక్స్ అంట, ఇంటింటికీ కేజీ బంగారం అంట. ఇంటింటికీ బెంజి కార్ అంటా.. నమ్ముతారా..
*పేదల భవిష్యత్‌ను కాపాడే యుద్ధానికి మీరు సిద్ధమా*
మరి ఇన్ని మోసాలతో.. ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ.. పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా... సిద్ధమే అయితే.. వారి చీకటి సోషల్ మీడియా, ఎల్లో మీడీయా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబుల్లోంచి సెల్ ఫోన్ తీసి లైట్ బటన్ నొక్కి పేదల భవిష్యత్తు కోరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే.. అని గట్టిగా చెప్పండి.. వాలంటీర్ మళ్లీ ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలు కొనసాగాలన్నా.... లంచాలు, వివక్షలేని పాలన జరగాలన్నా. మన పిల్లలు, బడులు, వ్యవసాయం, ఆసుపత్రులు బాగుపడాలన్నా.. ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ బటన్ పై నొక్కి 175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 పార్లమెంట్ స్థానాలకు 25 తగ్గడానికి వీలే లేదు.. నేను సిద్ధం.. మీరూ సిద్ధమేనా.?
*మన అభ్యర్ధును ఆశీర్వదించి గెలిపించండి*
- ఈ రోజు మన పార్టీ తరపున నిలబడుతున్న అభ్యర్థులను పరిచయం చేస్తున్నాను. మీ చల్లని దీవెనలు.. ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను.
- మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లలు, మీలో ఒకరు అతి సామాన్యురాలు... ఉమా బాలు నిలబడుతోంది.. మీ చల్లని దీవెనులు ఉంచాలని కోరుతున్నాను.
- భీమవరం నుంచి మీ లోకల్ హీరో శీనన్న (గ్రంధి శ్రీనివాసరావు) నిలబడుతున్నాడు.. మంచి వాడు సౌమ్యుడు.. రాబోయే రోజుల్లో మీకు మరింత మంచి చేయిస్తా.. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు శీనన్న మీద ఉంచాలని కోరుతున్నాను.
- తాడేపల్లి గూడెం నుంచి కొట్టన్న (కొట్టు సత్యనారాయణ) నిలబడుతున్నాడు.. మంచి వాడు సౌమ్యుడు.. అప్పుడప్పుడు కటువు కానీ మనసు వెన్న.
- ఆచంట నుంచి రంగరాజు నిలబడుతున్నాడు... మంచి వాడు సౌమ్యుడు తన కూడా మీ మంచికి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. నిజంగా జెంటిల్ మెన్ అని చెప్పవచ్చు.
- ఉండి నుంచి నరసింహ రాజు నిలబడుతున్నాడు.. నిజంగా చాలా మంచోడు. నరసింహ అన్న అంత మంచితనం చాలా తక్కువ మందిలో ఉంటుంది.. మీ ఆశీస్సులు ఉంచాలని కోరుతున్నాను.
- పాలకొల్లు నుంచి మీలో ఒకడు.. అతి సామాన్యుడు.. గోపీ నిలబడుతున్నాడు.. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాలని కోరుతున్నాను.
- తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు నిలబడుతున్నాడు..మనిషి గంభీరం. మనసు వెన్న.. చల్లని దీవెనలు అందించాలని కోరుతున్నాను.
- నర్సాపురం నుంచి ప్రసాద్ నిలబడుతున్నాడు.. నాకు స్నేహితుడు.. నిజంగా మంచి వాడు.. మనిషిలో క్యారెక్టర్ ఉంది.. ఇలాంటి రాజకీయాల్లో ఏనాడైనా మంచి చేస్తాడు. రాబోయే రోజుల్లో మరింత చేస్తాడు. మీ చల్లని దీవెనలు అందించాలని ప్రార్ధిస్తున్నాను.
- *ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.*
ఇక మన గుర్తు.. అక్కడో.. ఇక్కడో ఎవరైనా మరిచిపోతే.. మన గుర్తు ఫ్యాన్.. అక్కా.. అన్నా చెల్లి.. అవ్వా మన గుర్తు ఫ్యాన్.. మంచి చేసిన ఫ్యాన్ ఇంటిలోనే ఉండాలి.. సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన గ్లాసు సింక్ లోనే ఉండాలి. ఒక్కసారి అక్కడవరకు వచ్చి మీ అందరికీ కనపడి మళ్లీ వస్తాను అని చెబుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.