నష్టాల పేరుతో మూసివేతకు కుట్ర

30 Sep, 2018 15:02 IST
విజయనగరంః భీంసింగ్‌ చక్కెర ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. మూతపడ్డ ఫ్యాక్టరీని గతంలో వైయస్‌ఆర్‌ రూ.18 కోట్ల రూపాయలిచ్చి తెరిపించారని చెరకు రైతులు గుర్తుచేసుకున్నారు. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రభుత్వం పట్టించుకోకపోగా నష్టాల పేరుతో మూసివేతకు కుట్ర చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 48 కోట్ల  నష్టాల్లో ఫ్యాక్టరీ కూరుకుపోయిందన్నారు. చెరుకు ఉత్పత్తి కూడా దారుణంగా పడిపోయిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలన్నారు. చెరకుకు గిట్టుబాటు ధరకూడా లభించడం లేదన్నారు. టన్నుకు ప్రభుత్వం నుంచి 500 రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల బాట పట్టించి రైతులను ఆదుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.