రుణమాఫీ అన్నారు..నోటీసులు ఇచ్చారన్నా..
20 Oct, 2018 13:12 IST
వైయస్ జగన్‌కు మెట్టవలస గ్రామవాసి ఫిర్యాదు..
విజయనగరంః బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామవాసి సత్యారావు వైయస్ జగన్‌ను తమ బాధను మొర పెట్టుకున్నారు. తాను తీసుకున్న రుణం మాఫీ చేస్తామని హామీ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని జననేతకు ఫిర్యాదు చేశారు. రుణంపై వడ్డి కట్టాలని నోటీసులు జారీ చేశారని వాపోయారు. చంద్రబాబు తమను రుణామాఫీ పేరిట మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రుణం చెల్లించలేనని, అవసరమైతే జైలుకెళ్లడానికైనా సిద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.