బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు నాశనం
13 Nov, 2017 11:18 IST
వైయస్ఆర్ జిల్లా: గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని మహిళలు.. వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి . ఏడోరోజు పాదయాత్ర గా సోమవారం జొన్నవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. మహిళల ఆవేదన పట్ల స్పందించిన వైయస్ జగన్... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ఆయన తెలిపారు.