జగనన్నా.. జ‌నం మీ వెంటే

6 Dec, 2017 12:06 IST

అనంత‌పురం: అన్నా ఆరోగ్యం జాగ్రత్త..ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయినా జనం మీ వెంటే ఉన్నారు. బాబు పాలన పోవాలి...రాజన్న రాజ్యం రావాలి’...అంటూ పామిడి మండలం మిడుతూరుకు చెందిన యువకులు సురేశ్, వెంకటేశ్, శంకర్, పవన్, నారాయణస్వామి పెద్దవడుగూరు సమీపంలో వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శించారు. మీ వెంటే  మేమున్నామంటూ వారు వైయ‌స్‌ జగన్‌ను కలసి తమ మనసులోని మాటను చెప్పారు.