ఆయనంటే ఎందుకంత ఇష్టం!!
6 Nov, 2017 15:07 IST
వైయస్ జగన్.. ఈ పేరులో ఏ ముందో ఏమోకానీ.. ఆ పేరంటే కొందరికి పిచ్చి.... కొందరికి ప్రాణం.... మరికొందరికి ఆ పేరే ఆశా..శ్వాస. మీకు ఎందుకు జగన్ అంటే అంత ఇష్టం అంటే... ఏమో తెలియదు అని కొందరంటారు. మరికొందరు ఆయన ప్రజల కోసం కష్టపడడం నచ్చిందంటారు. ఇంకొందరు పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ఇచ్చిన మాటను నిలుపుకోవడం కోసం కష్టపడడం నచ్చిందంటారు. ఎవరు ఎన్ని చెప్పినా నా వరకు మాత్రం ఆయన ఓ సూరీడు. నిత్యం ప్రజల కోసం తపించే శ్రామికుడు. ప్రజలకు ఎవరూ చేయనంత మంచి పనులు చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని పరితపించే నాయకుడు. అందుకే వైయస్ జగన్ అంటే నాకూ ఇష్టం.
ఇచ్చిన మాట కోసం
చేసిన వాగ్దానం కోసం
ఎవరెన్ని కుట్రలు చేసినా..
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయక
పోరాటమే శ్వాసగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా
పోరాడుతున్న నాయకుడిగా ఆయన అంటే నాకూ ఇష్టమే.
ప్రజలు కష్టాలు తెలుసుకునేందుకు..
వారి పక్షాన పోరాడేందుకు
రాజన్న రాజ్యం తెచ్చేందుకు
చేసే ఈ`` ప్రజా సంకల్ప యాత్ర `` అనే యాగంలో
నేనూ పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది.
రాజన్న చేసిన మహా ప్రజా ప్రస్థానానికి సాక్షిగా
జనన్న చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు సైనికుడిగా
నేను గర్వపడుతున్నా.
- జగనన్న సైనికుడు