వైయస్ జగన్‌ను కలిసిన అరటి రైతులు..
19 Nov, 2018 13:30 IST
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గిజబలో తిత్లీ తుపాన్‌తో నేలకొరిగిన అరటితోటను వైయస్ జగన్ పరిశీలించారు. వైయస్ జగన్‌ను తోటపల్లి, గిజబ రైతులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం పరిహారం అరకొరగా అందించి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. వైయస్ జగన్ వస్తున్నారనే అరకొర పరిహారమైనా ఇస్తున్నారని రైతులు తెలిపారు. అరటిపంటకు సుమారు 40వేలు అవుతుందని.. పరిహారం 12 వేలు కూడా అరకొరగా ఇస్తున్నారని వాపోయారు.గతంలో హుదూద్ తుపాన్ పరిహారం ఇప్పటి వరుకు ఇవ్వలేదన్నారు.