అన్నా..పింఛన్ ఇవ్వడం లేదన్నా..
15 Nov, 2018 09:18 IST
విజయనగరం: అయ్యనపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్‌ను కలిసి అన్నా..అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. గురువారం తన తండ్రితో కలిసి వచ్చిన దివ్యాంగుడు జననేతను కలిశాడు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయానని, బతుకు తెరువు కష్టంగా మారిందని వాపోయాడు. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధలు విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.