నేడు సీఎం వైయస్ జగన్ పర్యటన షెడ్యూల్
6 May, 2024 10:29 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్‌లోని జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు.