నేడు సీఎం వైయస్ జగన్ పర్యటన షెడ్యూల్
10 May, 2024 10:48 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గంలో పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలో కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్‌లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.