సీఎం వైయస్ జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం వైయస్ జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వైయస్ఆర్ సర్కిల్‌లోని ఎస్‌వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.