సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి..
వైయస్ఆర్ జిల్లా: సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట పంచాయతీ పరిధిలోని సుంకేసుల గ్రామంలో రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి గా ఉంటేనే పేద ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు. అక్క చెళ్లమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసిన పచ్చ పార్టీకి ఓటు వెయ్యద్దు అని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం ఆసరా చేయూత ఇచ్చి ఆదుకున్న జగనన్న కు అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్ష పచ్చ పార్టీలు చేసే అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని రఘురామిరెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ని, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ డి గంగాధర్ రెడ్డి, ఆగ్రహం సొసైటీ చైర్మన్ పి.వి.రాఘవరెడ్డి, డి.యల్. శ్రీను ,ఖాజీపేట ఎంపీపీ బి.అభూభకర్ సిద్దిక్,జడ్పీ కో-ఆప్షన్ మెంబెర్ అచ్చుకట్ల కరిముళ్ల,మండల కన్వీనర్ డి.మురళి మోహన్ రెడ్డి,జిల్లా ఖాజీపేట జడ్పీటీసీ దవనం గంగాధర్, వై.యస్.ఆర్ సిపి నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, దుంపలగట్టు సర్పంచ్ రెడ్యం రామకృష్ణ రెడ్డి, సచివాలయ కన్వీనర్ కొత్తపేట గోపాల్ రెడ్డి, శెట్టిపల్లె సిద్దారెడ్డి,తిప్పాయపల్లె నాగసుబ్బారెడ్డి, మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు,ఎంపీటీసీ లు స్థానిక వై.యస్.ఆర్.సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు