చోడవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్
29 Apr, 2024 11:05 IST
అనకాపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్ చేరుకోనున్నారు. కొత్తూరు జంక్షన్ ఇప్పటికే జనసంద్రమైంది. మరికాసేపట్లో చోడవరం ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
చోడవరంలో సభ అనంతరం అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి.గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో జరిగే సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభకు సీఎం వైయస్ జగన్ హాజరై ప్రసంగిస్తారు.