పప్పు ఒక్కడే మాలోకం అనుకుంటే తప్పు
అమరావతి: ఇన్నాళ్లు పప్పుగారు ఒక్కరే మాలోకం అనుకున్నాం. కానీ ఆ బ్యాచ్ మొత్తం అలాగే తగలెడింది. ఏం విమర్శించాలో కూడా తెలీని తెలుగు తమ్ముళ్లను చూస్తే జాలెస్తోంది. వర్ధంతికి, జయంతికి తేడా తెలియదని ఇన్నాళ్లు చిన్నబాబునే అనుకున్నాం..కానీ టీడీపీలో అలాంటి వాళ్లు చాలానే ఉన్నారు. మొత్తం పచ్చ బ్యాచ్ అంతా మాలోకాన్ని మించిన తింగరి మాలోకాలున్నాయి...
ఏసీని ఇంటింటికీ సరఫరా చేస్తా అని చెంబా సారీ చంద్రబాబు చెబితే చెవిలో సీసం పోసుకున్న పచ్చ మంద నేడు బిల్డింగ్ మినిమం రూల్ ప్రకారం విండోస్ ఉండాలంటే బుగ్గన గారిని విమర్శిస్తున్నారు.
ఏసీ ఉండగా కిటికీ ఎందుకు అని అడిగే మేధావులతో టీడీపీ నిండి ఉండటం చూస్తే...
చెరువులో మూడు చేపల కథ గుర్తుకురావడం లేదూ...
టెక్నాలజీ అంటే గోడౌన్ లో ఏసీ పెట్టడం కాదు కదా ఎల్లోస్..
చివరికి గోడౌన్ లో కూడా వెంటిలేటర్స్ ఉంటాయి.
కమర్షియల్ బిల్డింగ్ అయినా డొమెస్టిక్ కన్‌స్ట్రక్షన్ అయినా ఫైర్ సేఫ్టే రూల్స్ ప్రకారం కిటికీలు తప్పనిసరి.
భారీ మాల్స్ కూడా సెంట్రల్ ఏసీతోనే ఉంటాయి...వాటికి సైతం గ్లాస్ విండోస్ ఉంటాయి.
వాతావరణ పరిస్థితులను బట్టి అన్నిసార్లూ ఏసీ వినియోగించరు....
ఇండియాలాంటి విపరీత వాతావరణ పరిస్థితులున్న చోట నిర్మాణాలకు సహజమైన గాలి, వెలుతురూ ఉండేలా ఏర్పాటు చేయాలన్నది మినిమం కామన్ సెన్స్
కోట్లు ఖర్చు పెట్టి సెంట్రల్ ఏసీ బిల్డింగుల్లో ఉన్నవాళ్లైనా స్వచ్ఛమైన గాలి కావాలంటే తలుపు తీసుకుని బయట వాతావరణానికి రావాల్సిందే.
ఈ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా తమ తెలివితక్కువతనాన్ని పదే పదే ప్రచారం చేసుకుంటూ లోకేష్ కి తగ్గ అనుచరులనిపించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.