చంద్రబాబు మహాసంకల్పంలోని అసలు రహస్యం
చంద్రబాబు ఎప్పటిలాగానే పనీ పాట లేని టాపిక్ మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అరిగిపోయిన టేపు రికార్డులా అబద్దాలు చెప్పి, చెప్పి అలసట వచ్చింది. మహా సంకల్పం సందర్బంగా ఎన్నెన్నో చేస్తానని గొప్పలు చెప్పిన బాబు ని విలేకరులు కొన్ని ప్రశ్నలు వేశారు.
`` విజన్ 2050 అంటే ఏంటి సార్ ?`` బాబుని విలేకరులు అడిగారు
`` అంటే ఇంకో 30 ఏళ్ళకు పైగా అధికారంలో వుండడం ``
`` అప్పటికి మీ వయసెంత ? ``
``తొంభై దాటుతుంది ``
`` అంటే ఈ రాష్ట్రాన్ని ముసలిదానిగా చేయాలనా మీ ఉద్దేశం ``
`` తమిళనాడులో కరుణానిధిలాగా నేను కూడా ఏలుతా. అయినా రాజకీయాలకి వయసేముంది ? చక్రాల కుర్చీలో కూర్చుని కూడా చక్రం తిప్పొచ్చు ``
`` అయినా ఇంకో 30 ఏళ్ళు వుండి ఏం చేయాలని ? ``
``రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ``
`` ఇన్నేళ్ళ నుంచి ఏం తీసుకుపోయారు ``
`` హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేసా ``
`` మీరు పుట్టక ముందు నుంచే హైదరాబాద్ మహానగరం. ఒక రాజధాని ``
`` సాఫ్ట్‌వేర్‌ని నేనే డెవలప్ చేసా ``
``సాఫ్ట్‌వేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పు. మీరున్నా వస్తుంది లేకపోయినా వస్తుంది. మీరు అధికారంలో లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే అందరి చేతుల్లో సెల్‌ఫోన్లు కూడా మీరు సాధించిన అభివ్రద్ధి అనే చెప్పేవారు``
`` గొప్పలు చెప్పుకోవడం నాకలవాటు లేదు, చేసిందే చెబుతా ``
`` బషీర్ బాగ్ కాల్పులు, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించడం గురించి చెప్పండి ``
`` నా విజన్ మీకు అర్థం కావడంలేదు ``
`` ఇప్పటికి లక్షకోట్లు సంపాందించారు. మీ కొడుకు ఇంకో రెండు లక్షల కోట్లు సంపాదిస్తాడు. ఇదే మీ విజన్ ``
``ఆంధ్రరాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్ చేస్తా ``
`` అవినీతిలోనా ? ``
``రెండెకరాలు లక్షకోట్లు ఎలా అయిందో చెప్పండి. మీ వ్యాపార రహస్యాన్ని అండన్ బిజినెస్ స్కూల్ వాళ్ళు అడుగుతున్నారు. పిల్లలకు పాఠ్యాంశంగా పెడతారట``
`` నా జీవితమే తెరచిన పుస్తకం ``
`` పుస్తకమే కానీ, అందులో అన్నీ ఖాళీ పేజీలే. మీకు మాత్రమే అక్షరాలు కనిపిస్తాయి. మీ భక్తులకు సువర్ణాక్షరాలు కనిపిస్తాయి ``
`` నేను చరిత్రలో నిలబడిపోయే వ్యక్తిని ``
`` మామకి వెన్నుపోటు పొడిచిన అల్లుడిగా ఆల్రెడీ నిలబడిపోయారు ``
`` అందుకే ఆయనకి భారతరత్న సిఫార్సు చేసాను ``
`` భారతంలో అభిమన్యుడు లాంటి వాడు ఎన్టీయార్ మీ వ్యూహాన్ని కనిపెట్టలేక రాలిపోయాడు ``
`` గత చరిత్ర ఎందుగ్గానీ ఇక పైన నేను సృష్టించేదంతా చరిత్రే ``
`` ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. ఇంకో 30 ఏళ్ళు మీకు అధికారమిస్తే కనీసం వెయ్యేళ్ళు వెనక్కి తీసుకెళతారని వాళ్ళకు తెలుసు. అందుకే 2019 తో మీ చరిత్ర సమాప్తం ``
`` ఈ లోగా ఎంతనొక్కాలో నాకు తెలుసు `` అంటూ బాబు వెళ్లిపోయాడు.