చంద్రబాబు విదేశీ పర్యటనల రహస్యం ఇదన్నమాట

25 Jul, 2016 18:20 IST


`` ప్రపంచంలోని దేశాలన్నీ మీరు ఎందుకు  తిరుగుతున్నారు ? `` అడిగారు  విలేకరులు.

`` గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారినపుడు గ్రామాలన్నీ ఇష్టపడే  వ్యక్తిగా నేను ప్రపంచమంతా  తిరగాలనుకుంటున్నాను `` అన్నాడు చంద్రబాబు.

`` మీరు  దేశాలు తిరగడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఏంటి ఉపయోగం ``

``యోగముంటేనే  ఉపయోగపు విలువ తెలుస్తుంది. వివిధ దేశాల్లో  ఉన్న భవనాలు చూడడం వల్ల ఆ అనుభవం అమరావతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది``

 

 `` ఈ మాట రెండేళ్ళ నుంచీ  చెబుతున్నారు, ఇంతవరకూ ఉద్యోగులకు భవనాలు కూడా కట్టలేదు ``

  ``రోమ్ ని ఒకరోజులో  నిర్మించలేరు ``

 `` అంటే మీరు మరో రోమ్ ని నిర్మిస్తున్నారా ? ``

 ``రోమ్ ని మించి నిర్మిస్తా  ``

`` మిమ్మల్ని చూస్తుంటే పిట్టల దొర గుర్తుకొస్తున్నాడు. అర చేతిలో అమరావతి చూపిస్తూ కాలుగాలిన పిల్లిలా దేశాలన్నీ తిరుగుతున్నారు``

 ``ప్రతి  దేశంతో ఏదో ఒప్పందాన్ని కుడుర్చుకుంటున్నాను ``

 

`` దేశాలతో ఒప్పందం కుదుర్చుకోడానికి మీరేం కేంద్రం కాదు. చెవిలో పువ్వు  పెట్టకండి ``

 ``ప్రతి దేశం  మన రాష్ట్రంలో పెట్టుబడులు  పెట్టడానికి  ముందుకొస్తోంది``

`` పెట్టుబడులు పెట్టడానికి కాదు వస్తున్నది. కాంట్రాక్ట్ వర్క్ చెయ్యడానికి కంపెనీలను  మీరు బతిమాలుతున్నారు.``

 ``వాళ్ళు పనులు  నాణ్యంగా చేస్తారు. మనవాళ్లయితే  అంత గిట్టుబాటు కాదు. పైగా తెలిస్తే అల్లరి ``

 ``ఇవన్నీ ప్రతిపక్షాల  ఆరోపణలు ``

 ``ఆరోపణలు కాదు వాస్తవాలు ``

 

``ప్రజల  కోసం నేను బిచ్చగాడిలా అందర్నీ ఆడుక్కుంటూ వుంటే అవమానిస్తున్నారు ``

 ``లక్ష కొట్లున్న మీరు బిచ్చగాడెలా  అవుతారు. ప్రజల్ని బిచ్చగాళ్ల మాదిరిగా చేస్తున్నారు ``

 `` నేను  ఎక్కే విమానం, దిగే విమానంలా వ్యవహరిస్తూ కష్టపడుతున్నాను ``

``విమానం  ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు ``

 ``అందమైన నగరం అమరావతి కావాలంటే ప్రజలు త్యాగాలు  చేయాలి ``

 `` మీ పాలనలో  ప్రజలు బట్టలు  కూడా  త్యాగం  చెయ్యాల్సిందే ``

`` విమానానికి టైమైంది `` అంటూ  బాబు తైవాన్ వెళ్ళిపోయాడు.