సంతకం చెప్పిన చరిత్ర
చీకటి చెరలో మగ్గే రాష్ట్రానికి వెలుగురేఖలా సూరీడొచ్చిన రోజిది.
కరువు విలయతాండవం చేస్తుంటే వర్షపుధారను వరంగా తెచ్చిన రోజిది.
నీరోలాంటి నారా పాలనకు చరమగీతంపాడిన రోజిది.
సువర్ణయుగానికి సంక్షేమ సంతకం పెట్టిన రోజిది.
ప్రజానాయకుడికిరాష్ట్రంపట్టంకట్టినరోజిది…
2004 - మే 14 వైయస్ఆర్ మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. వెనువెంటనే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా ఉచిత విద్యుత్తు ఫైలు పై తొలి సంతకం పెట్టారు.
రైతులను విద్యుత్ ఛార్జీల నుంచి విముక్తి చేసి, లక్షల కుటుంబాల్లోవెలుగులు నింపి, వ్యవసాయాన్నిపండగ చేసిన సంతకమది. ప్రజల నమ్మకాన్నివమ్ము చేయని సంతకమది.
పదేళ్లుగడిచాయి…ఓమహా చరిత్ర రాసిన మహనీయుడు వెళ్లిపోయాడు. కుట్రలు, వెన్నుపోట్లు, వంచన, స్వార్థం గూడుకట్టుకున్న ఒకనాటి ప్రభుత్వం మేకవన్నె పులివేషంలోమళ్లీవచ్చింది.
ఈసారి రాష్ట్రాన్నిముక్కలు చేసి మరీ రాజ్యాదికారం చేజిక్కించుకుంది.
ఆ అధికారం పేరు చంద్రబాబు.
ఎన్నికల ముందు మేకలా సాధు స్వభావం చూపించి, గెలిపిస్తే5 ముఖ్యఅంశాలపై తొలి సంతకం అన్నాడు బాబు. రైతుల రుణమాఫీ, డ్వాక్రారుణ మాఫీ, చేనేతల రుణమాఫీ, పింఛన్ల పెంపు,బెల్టు షాపుల రద్దు, మంచినీటి సరఫరా, పదవీ విరమణ వయసు పెంపు హామీల ఫైళ్లపై తొలి సంతకాలు పెడతాన్నాడు. చిట్టచివరిది తప్ప మొదటి నాలుగింటికి పంగనామాలు పెట్టాడు.
రైతురుణ మాఫీకి సంతకం అని చెప్పి, రైతురుణ మాఫీకి సంబంధించి విధివిధానాల కమిటీ ఏర్పాటుకు సంతకం పెట్టి తొలివంచనకు శ్రీకారం చుట్టాడు. ఆ విధంగా విశ్వసనీయతకు మారుపేరుగా వైఎస్సార్ నిలిపిన తొలిసంతకాల సిద్ధాంతాన్ని, వాటి సార్థకతను సర్వనాశనం చేసాడు బాబు. రుణాలమాఫీ హామీని దశలవారీగా మాఫీ చేసేశాడు. చేనేత, డ్వాక్రా రుణాల మాఫీని మాయచేసి ఎగ్గొట్టాడు. ఫించన్లు పెంచుతానని చెప్పి ఉన్న పింఛన్లు ఊడబెరికాడు, పింఛన్లకు బడ్జెట్ లో సగానికిపైగా కోత పెట్టేసాడు. మద్యం విధానంతో బెల్టు షాపులను భేషుగ్గా పెంచి పోషిస్తున్నాడు. రాష్ట్రం మొత్తంలో ఒక్క మండలానికి కూడా సరైన తాగునీరు అందుబాటులో లేకుండా చేసాడు. ఇదీ బాబు సంతకాలు చేసిన హామీల అతీగతీ.
వైఎస్సార్ అధికార పగ్గాలు చేపట్టగానే సంక్షేమ పాలనకు తొలి మెట్టుగా, నాయకుడిచ్చిన వాగ్దానానికివిలువ, విశ్వసనీయత ఉండేలా, ప్రజల్లో నమ్మకం నిలబడేలా ఓ సంతకాన్ని చేసారు. సంతకం చేయడమే కాదు, ఆ హామీని అక్షరాలా అమలు చేసి చూపించారు. ఆ సంతకం చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసారు.
కానీ చంద్రబాబు 5సంతకాలూ ఇంకులేని పెన్నుతో చేసినవే. గాలిలో రాతల్లా అవి చెరిగిపోయాయి. నీటిలో రాతల్లా అవి కరిగిపోయాయి. చివరికి మాయం అయిపోయాయి.
రాజకీయాలు మాత్రమే చేసే చంద్రబాబు లాంటి నాయకులు ఎందరో ఉండచ్చు...
రాకీయమే నిలువెత్తు నాయకుడైన లక్షణం వైయస్ రాజశేఖర్ రెడ్డి.
ఓ మాట, ఓ నవ్వు, ఓ సంతకంతో వైయస్ ఆర్ చరిత్ర సృష్టిస్తే,
ఓ వంచన, ఓ వెన్నుపోటు, ఓ అవినీతి చంద్రబాబుతో సహా చరిత్రహీనం అయ్యాయి.