దుబారా హమారా అంటున్న బాబు...
12 Sep, 2018 19:07 IST
అప్పుడెప్పుడో స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు...ఆ దెబ్బకు రాష్ట్రం దివాళాతీసి కరువుతో అల్లాడిపోయింది.
ఆ తర్వాత ఆరోగ్యాంధ్రప్రదేశ్ అన్నాడు... రాష్ట్రంలో వైద్యం పడకేసింది.
ఇప్పుడు సన్ రైజ్ అంధ్రప్రదేశ్ అంటున్నాడు.... రాష్ట్రం అప్పుల ఊబిలో పడి అప్పులప్రదేశ్ అయ్యింది.
బాబు దుబారా కోసం ఖర్చు చేసిన లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు అప్పుల పాలయ్యిందో తెలుస్తుంది.
బాబు ప్రమాణ స్వీకారానికి అయ్యిన ఖర్చు 50కోట్లు
హైదరాబాద్ లో ఇల్లు బాగు చేయడానికి 20 కోట్లు
సెక్రటేరియట్ రీమోడలింగ్ కి 20 కోట్లు.
బెజవాడ కాంప్ ఆఫీస్ 20 కోట్లు
బెజవాడలో ఇల్లు 5 కోట్లు
ఇంటికి దారులు కరెంట్ కోసం 22 కోట్లు
పుష్కరాల షూటింగ్ కోసం 250 కోట్లు
ప్రత్యేక విమానాలు, విదేశాల తిరుగుళ్లు 75 కోట్లు
శంకుస్థాపనల కోసం 400 కోట్లు
భూమి పూజ కోసం 50 కోట్లు
కెసిఆర్ ని ఆహ్వానించడానికి ఇంటికి వెళ్లి నందుకు 1 కోటి
లగ్జరీ బస్సు 5 కోట్లు
వాడని హెలికాఫ్టర్ కి 14.33 కోట్లు
ఇంకా ప్రచారాల కోసం, పటాటోపాల కోసం బాబు చేసిన ఖర్చు, లోకేష్ కు తెలుగు నేర్పడానికి పెట్టే ఫీజు, ఎసిల మధ్య దద్దమ్మ పోరాట సభలకు అయిన ఖర్చులు కూడా కలిపి చూస్తే ఓ ఏడాది రాష్ట్ర బడ్జెట్ ను దాటిపోతుంది.
సొంత రాష్ట్రంలో ప్రజల సొమ్మునే కాదు పక్క రాష్ట్రాల ప్రజల సొమ్మును కూడా బాబుగారు భేషుగ్గా భోంచేస్తారు. నిండా నాలుగ్గంటలు కూడా స్టే చేయని హోటలో లో 8లక్షల బిల్లు కట్టించాడు చంద్రబాబు.