చుప్పనాతి చంద్రయ్య
5 కోట్లతో నే ఆర్బాటంగా ప్రమాణ స్వీకారం చేస్తే జగన్ అందులో పావు వంతు కూడా ఖర్చు చేయకుండా పదవీ ప్రమాణం చేసేసారు.
దేశం మొత్తం పిలవని పేరంటానికి వెళ్లిన నన్ను స్పీకర్ ను పోడియంలోకి తీసుకువెళ్లడానికి బొట్టెట్టి పిలవడం మానేసారు.
ఒకప్పడు ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్టు లోకి రానివ్వని నన్ను ఇప్పుడు ఎయిర్పోర్టులో అడుగు పెట్టడానికి తనిఖీ చేసారు.
23 మంది ఎమ్మెల్యేలను కొని 23 మంది ఎమ్మెల్యేలనే గెలిపించుకున్న నాకు ఫిరాయింపుల గురించి లెక్చర్ ఇచ్చారు.
కాలికి బలపం కట్టుకుని స్టాలిన్, కుమారస్వామిల దగ్గరకు నేను పరుగులు పెడితే వాళ్లేమో వైఎస్ జగన్ ను ఎదురెళ్లి కౌగిలించుకుంటున్నారు.
వీడియో కాన్ఫరెన్సుల్తో అధికారులను నేను గంటలు గంటలు కూర్చోబెడితే, ఇప్పుడు గంటలో మీటింగులు కానిచ్చి పంపించేస్తున్నారు.
కాంట్రాక్టులను కమీషన్ల కోసం వాడుకుంటే వాటన్నిటినీ రివైజులు చేయిస్తున్నారు.
హిమాలయా నీళ్లతో నా లెవెల్ చూపిస్తే కిన్లేతో వీళ్లు సింపుల్ గా పని కానిచ్చేస్తున్నారు.
మోదీ ఇచ్చిన ప్యాకేజుకు నే ఒకే చెబితే వీళ్లు మోదీని ఒప్పించి హోదా తెచ్చేందుకు ట్రై చేసేస్తున్నారు.
పెట్టుబడి లేని వ్యవసాయం కోసం నేను 250 కోట్లు ఖర్చు పెడితే, రైతుల పెట్టుబడి కోసం వీళ్లు ఈ ఏడాదే 12500 ఇచ్చేస్తున్నారు.
బాదం పిస్తాలకు నే లక్షలు భోంచేస్తే వీళ్లు ఖర్చు తగ్గించేందుకు కొత్త ప్రణాళికలేస్తున్నారు.
వాట్ ఈజ్ దిస్ దారుణం...వాట్ అయామ్ సేయింగ్ ఇలా చేస్తే నేను నా పార్టీ ఇంకో పాతికేళ్లకూ ప్రతిపక్షంలోనే ఉంటాం...మళ్లీ చెబుతున్నాం ఇట్ ఈజ్ వెరీ దారుణం.