చంద్రబాబు విరచిత రాజధాని కథ
వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని చుట్టూ నడుస్తున్నాయి. ఒకవైపు వరదలు, మరోవైపు రాజధాని తరలింపు. వరదలు వర్షాల కారణంగా సహజంగా వచ్చినవైతే.. రాజధాని తరలిపోతుందనే పుకారు మాత్రం ఎల్లో గ్యాంగు శిబిరంలో వండి వడ్డిస్తున్నవే. వరద ముంపు విషయంలో ప్రభుత్వం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు శాయశక్తులా నష్ట నివారణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. వరదల్ని అడ్డుకోలేకపోయినా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా మాత్రం ఆపగలిగారు. వారంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో తలమునకలవుతుంటే... టీడీపీతో సహా టీజేపీ(తెలుగు జనతా పార్టీ... బీజేపీలో చేరిన తెలుగుదేశం నాయకులు) కొత్త రకమైన ప్రచారం మొదలెట్టింది. వామ్మో.. రాజధాని తరలిపోతోందని గుండెలు బాదుకోవడం మొదలు పెట్టింది. ఇరవై నాలుగ్గంటలు ఒకటే శోకండాలు, ఆర్తనాదాలు, పొర్లుదండాలు. వారి ఆవేదన చూసి పాపం ఎల్లో మీడియాకు కూడా జాలేసింది. నీళ్లలో మునిగిన జనావేదన వదిలేసి రాజధాని రాజకీయంలో తలా ఒక చెయ్యేశారు. ఇంకేముంది... ఏబీఎన్‌లో నవ యువ శ్రామికుడు చంద్రబాబు పనితనం మీద స్పెషల్ స్టోరీలు, తెలుగు దొంగల నాన్‌స్టాప్ అబద్ధాల ప్రసంగాలు, పెయిడ్ ఆర్టిస్టులతో ప్రాప్టింగ్ అభిప్రాయాలు. నడుముకి గోచీ చుట్టుకుని.. మట్టి మోసి.. ఇసుక, సిమెంట్ కలిపి చంద్రబాబు నిర్మించిన చిల్లుల కొంపలు ఖాళీ అవుతున్నాయని ఒకటే ఏడుపు. వేల గంటలు, కోట్ల నిమిషాలు ధారబోసి కట్టిన అంతర్జాయతీ ప్రజా రాజధాని, అయిదేళ్లలో నిర్మించిన వాటికన్‌సిటీ, లండన్, న్యూయార్క్, సింగపూర్, మలేషియా, టోక్యో, ఇస్తాంబుల్, కొలంబో, దుబాయ్... ఇన్ని నగరాలు ఇకపై బోసిపోవూ.. అయిదేళ్లు బురదలోపోసిన డబ్బంతా ఏమైపోనూ అని ఏడుపుగొట్టు అనాలసిస్‌లు.. ఇదంతా చూడబోతుంటే ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్నట్టుంది. రాజధాని తరలిపోతుందని ఎవరూ చెప్పనేలేదు. బొత్స సత్యనారాయణ మాత్రం ఈ ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ ముందే చెప్పిందని గుర్తు చేశాడు. వైఎస్సార్సీపీ కూడా భౌగోలిక స్వరూపం గురించే ఆందోళన వ్యక్తం చేసిందనే విషయాన్ని ప్రస్తావించాడు. అదే ఇప్పుడు నిజమని తేలిందని బొత్సా చెప్పాడు. వాళ్లు చెప్పిందే నిమజని చంద్రబాబు కూడా ఎప్పుడో అంగీకరించాడు. లేదంటే 10 వేల ఎకరాలను మట్టి పోసి 5 మీటర్ల ఎత్తు లేపుతానని ఆనాడు చంద్రబాబు ఎందుకు ప్రకటించినట్టు. కొండవీడు వాగు పొంగితే రాజధాని మునగడం ఖాయమని ఆనాడే జగన్ అసెంబ్లీలో చెప్పలేదా. హైపవర్ మోటార్లు పెట్టి నీరు తోడతానని చంద్రబాబు ఎకసెక్కాలు ఆడలేదా. ఆ మాట నిజం కాబట్టే కదా కృష్ణా నదిని ఆనుకుని 500 మీటర్ల దూరంలో కొండవీటి ఎత్తిపోతల పథకాన్నికట్టారు. ప్రపంచంలో ఏమూలనైనా నదికి ఇంత దగ్గర్లో ఎత్తిపోతల పథకాన్ని కట్టిన చరిత్ర ఉందా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ అయిదేళ్ల కాలంలో ఏనాడూ వర్షాలు కురవలేదు కాబట్టి ఆయన విజనరీ లో ఉన్న విజన్ (భూ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్ ) బయటి ప్రపంచానికి తెలియలేదు. ఇప్పుడలా కాదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నిర్ణయాలన్నీ స్వార్థపూరితం అని ఒక్కొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి. చంద్రబాబుని జనం అసహ్యించుకునే పరిస్థితులు తలెత్తాయి. అందుకే ఎల్లో మీడియా నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. ప్రజా రాజధానిలో ప్రజలు పడుతున్న కష్టాలు వదిలేసి.. తమకు ముప్పు రాకుండా ఉండేందుకు రాజధాని తరలిపోతుందని కొత్త వాదన ప్రచారంలోకి తీసుకొచ్చింది. దానికి బొత్స చేసిన ప్రకటనను బూచిగా చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా చంద్రబాబు నేతృత్వంలో జనాన్ని మాయ చేసి తమ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి నడుస్తున్న సందర్భోచిత గోబెల్స్ ప్రచారం మాత్రమే. ఇంకో ముఖ్యవిషయం ఇక్కడ ప్రస్తావించాలి. చంద్రబాబు ఉన్న అయిదేళ్లు వానలు కురవలేదు. జనం కరువుతో అల్లాడారు. కానీ జగన్ రాగానే వర్షాలు కురవడం మొదలైంది. ఎప్పుడూ నిండని ప్రాజెక్టులు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. జనం ఈ విషయాన్ని మాట్టాడుకోకుండా ఉండాలంటే.. జనం భయపడే మరో విషయాన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావాలి. అక్కడ్నుంచి పుట్టిందే ఈ రాజధాని తరలింపు. ఇది చంద్రబాబు విరచిత రాజధాని కథ.