తమ్ముళ్ళకు బాబు పాఠాలు
11 Jun, 2015 19:35 IST
చంద్రబాబు తమ్ముళ్ళకు ఎబిసిడిలు కొత్తగా నేర్పించాడు
- A-Acting-రాజకీయాల్లో ఎంత బాగా నటిస్తే అంత డెవలప్‌మెంట్
- B-Backstab-వెన్నుపోటు పోడవడం నన్ను చూసి నేర్చుకోండి
- C-Corruption-కరప్షన్ అనేది మన జీవన విధానం. ఇప్పుడు దీంతోనే దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకొన్నాం.
- D-Deceive-నమ్మిన వారిని మోసం చేయడమే మన టైప్ పాలిటిక్స్
- E-Eating-రాజకీయాల్లో తినడం ముఖ్యం
- F-Fox-అన్నింటిలోనూ నక్క మనకు ఆదర్శం
- G-Gobels-గోబెల్స్ ప్రచారంలో మనకు మనమే సాటిగా ఉండాలి
- H-Hat-మాటలతో టోపీ పెట్టాలి
- I-Iam-నేను అనే భావన ముఖ్యం.ఎదుటివాడు మునిగి పోయినా నేను బాగు పడాలి
- J-Jump-రాజకీయాల్లో అవసరాన్ని బట్టి జంపింగ్ చేస్తుండాలి
- K-Kickback-ముడుపులివ్వాలి,తీసుకోవాలి
- L-Lie-అబద్దాలు చెబుతూనే ఉండాలి,ఆపితే మనతల వెయ్యి వక్కలవుతుంది
- M-Magic-తిమ్మిని బొమ్మి,బొమ్మిని తిమ్మి చేసే మ్యాజిక్ సాధన చేయాలి
- N-NTR-అవసరమైనపుడు ఎన్టీఆర్ పేరును స్మరించాలి,అవసరం తీరాక చెత్తబుట్టలో వేయాలి(ఇది జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా వర్తిస్తుంది)
- O-Opinion-నిరంతరం ఒపీనియన్స్ మారుస్తూండాలి అప్పుడే నిజమైన పొలిటీషియన్లగా మారుతాం
- P-People-ప్రజలు,ప్రజలు అంటూ ఉండాలి,అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళకి సున్నం కొట్టాలి
- Q-Qualification-మనకి ఏ యోగ్యత లేకపోయినా అనుక్షణం ఎదుటి వాళ్ళ యోగ్యతని ప్రశ్నిస్తూవుండాలి
- R-Rate-అందరికి ధరలు నిర్ణయించి అవసరమైనపుడు కొనాలి
- S-Strategy-ఎదుటి వాళ్ళని ముంచడానికి వ్యూహం పన్నాలి.అదే సమయంలో మనం మునగకుండా చూసుకోవాలి
- T-Truth-సత్యం మనకు జీవిత కాలపు శత్రువు,నిజాన్ని మన దరిదాపులకి కూడా రానివ్వకూడదు
- U-Use-మనుషుల్ని ఉపయోగించుకొని తరువాత విసిరి పారేయాలి
- V-Values-ఎల్లప్పుడూ విలువల గురించే మాట్లాడు అయితే ఎప్పుడూ ఆచరించకు
- W-Win-ఎలాగైనా గెలవాలి కిందపడినా మనమే గెలిచామని వాధించాలి
- X-Xray-ఎక్స్‌రేకళ్ళు అవసరం మనం వెన్నుపోటు పొడవక తప్పదు,కాబట్టి,మనల్ని ఎవడూ వెన్నుపోటు పొడవకుండా జాగ్రత్తపడాలి
- Y-Yes-అన్నింటికి ఎస్ అనాలి,ఏ పని చేయకుండా వుండాలి
- Z-Zigzag-సరళరేఖల్ని కూడా జిగ్‌జాగ్ చేసి అందరికి తికమక పుట్టించాలి.
-రాహుల్