బాబు ఎప్పుడు పర్యావరణ ప్రేమికుడయ్యాడు?
3 Sep, 2022 17:56 IST
అమరావతి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏనాడు కూడా పర్యావరణం గురించి పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నా తనకు పర్యావరణం గురించి పట్టదు. అలాంటి వ్యక్తి పర్యావరణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
నారా వారి అరాచకాలు ఎన్నెన్నో..
- కృష్ణా నది కరకట్ట మీద అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటాడు.
- ప్రజావేదిక అంటూ ప్రభుత్వ భవనాన్ని కూడా నిబంధనలు అతిక్రమించి అక్రమనిర్మాణం చేసి అందులో పార్టీ కార్యక్రమాలన్నీ చేసుకుంటాడు.
- కుల అస్మదీయులందరికీ ఆక్రమణలకు పర్మిషన్ ఇచ్చేసాడు.
- వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ నదీపరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలన్నందుకు తన గూండా కార్యకర్తలతో ఆయన కారును వెంటాడి వేధింపులకు గురిచేయించాడు
- నీరు, మట్టి, ఇసుక అడ్డగోలుగా దోపిడీ చేసాడు
- ఆ ఇంటికి సమీపంలోనే అడ్డగోలుగా నదీపరివాహక ప్రాంతంలో చేసిన ఇసుక దోపిడీ చేస్తున్నారని గుర్తించిన NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) బాబు ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించింది.
- సొంత ఎంపీది కనుక అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ పర్యావరణ ఉల్లంఘనలు చేసినా పట్టించుకోలేదు.
- పర్యావరణ వైవిధ్యాన్ని నాశనం చేస్తూ, ఆహారధాన్యాల కొరత వచ్చేలా మూడు పంటలు పండే వేలాది ఎకరాల పచ్చటి భూములను దిబ్బచేసి రాజధాని నాటకం ఆడాడు.
- ప్రజలకు గ్రాఫిక్స్ తో ఆశలు చూపించి పంట భూమిని రియలెస్టేట్ సామ్రాజ్యంగా మార్చాడు
- ఉద్దానంలో ఏళ్ల తరబడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోలేదు
- పట్టిసీమలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి
- ఇన్ని ఘాతకాలు చేసిన బాబు నేడు రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంటే పర్యావరణానికి ముప్పు అని దాన్ని క్యాన్సిల్ చేయమని లేఖలు రాయిస్తున్నాడు.
- తెలంగాణలో ఫార్మా కంపెనీలు ఉండగా లేని పర్యావరణ సమస్య ఏపీలో మాత్రమే వస్తుందా?
- అయినా నిబంధనలకు లోబడి, వ్యర్థాలను సవ్యంగా రీసైకిల్ చేసే వ్యవస్థ ఉంటేనే సదరు కంపెనీలకు అనుమతులు వస్తాయి.
- అది తెలిసి కూడా రాష్ట్రం అభివృద్ధి చెంద కూడదని, ఆ ఘనత వైయస్ జగన్ కి రాకూడదనే కుత్సిత బుద్ధితో మాత్రమే చంద్రబాబు ఈ నీచమైన కుట్రలకు పాల్పడుతున్నాడు.