బాబు పలుకులకు సామాన్యుడి చెణుకులు

28 Nov, 2018 18:03 IST

 

కూటమి సభలో బాబు బంగారు పలుకులు పలుకుతున్నాడు. బాబు ప్రతి వాఖ్యకు సామాన్యుడి ప్రతిస్పందన ఇలా ఉంది.

 

కాంగ్రెస్ తో కలవడం ఓచారిత్రక అవసరం - ఒకప్పుడు సొంతమామకు పొడిచిన వెన్నుపోటు, ఇప్పుడు ఆంధ్రాకు పొడుస్తున్న పోటు అన్నీ నీ రాజకీయా అవసరాలే

దేశం బాగుంటే అంతా బాగుటాం - అంటే తెలుగుదేశమా

ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడింది - అవును 23 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా నువు కొన్నప్పుడు, పక్క రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ ఓటు కోసం నువు కోట్లు పంపినప్పుడు

సిబిఐ, ఐటి, ఈడీ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి - అవును మేమూ అదే అనుకుంటున్నాం...అవే సవ్యంగా పనిచేస్తే నువ్వీపాటికి జైల్లో ఉండేవాడివి.

పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం వచ్చిందా? - జనాలకు లాభం రాకూడదనే కదా నువు మోదీకి ఈ ఐడియా ఇచ్చావ్? మాకు తెలుసులే.

ముస్లింలకు అభద్రతాభావం కలిగింది - కలగదా మరి ముస్లింల ఆత్మీయ సభ అని పెట్టి మరీ ముస్లిం యువకులను అరెస్టులు చేయించావ్ కదా.

దళితులు అభద్రతాభావంతో ఉన్నారు - నువ్వూ, నీ తెలుగు తమ్ముళ్లూ కలిసి అంతలా మానసికంగా, భౌతికంగా హింసించారు మరి.

ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయినాయ్ - ఈమాట వంద శాతం నిజం. విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత జగన్ మీద జరిగ హత్యాయత్నమే అందుకు సాక్ష్యం. రోజుకో సోషల్ మీడియా కార్యకర్తను అరెస్టు చేస్తున్న ఘటనలే సాక్ష్యం.

37ఏళ్లుగా కాంగ్రెస్ తెలుగుదేశం పోట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ దేశం కోసరం కలిసాం - కాదని ఎవరన్నారు? నీ దేశం కోసమే తెలుగుదేశం కోసమే, నీ తెలుగుదేశం బతికిబట్టకట్టడం కోసమే కాంగ్రెస్ తో వెళ్లి కలిసావ్. వేరే దిక్కులేక వెళ్లి కలిశావ్. రేపు నీ అవినీతి చరిత్ర తవ్వి తీయకుండా కాపాడుకోవడానికి, కేసులపై స్టేలు కంటిన్యూ కావడానికీ కలిసావ్.