‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’

భావోద్వేగానికి గురైన వృద్ధుడు మోపిదేవి లీలాజలం 

మచిలీపట్నం: ‘జగన్‌బాబు దేవుడయ్యా... ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెలా ఒక­టో తేదీకల్లా జీతం ఇచ్చినట్లు వలంటీర్ల ద్వారా పెన్షన్‌ పంపి మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు. పిల్లల ఆదరణలేని అనేకమంది వృద్ధ దంపతులను సొంత కొడుకులా ఆదుకుంటున్నాడు.

జబ్బు చేసినా పెద్ద వైద్యం చే­యించి ఆదరణ లేని మాలాంటి ముసలోళ్లను కాపాడుతున్నాడు..’ అంటూ కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పె­ద­పట్నం గ్రామానికి చెందిన వృద్ధుడు మోపిదేవి లీలాజలం కన్నీరు పెట్టుకున్నాడు. పెదపట్నంలో మంగళవారం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

‘జగనన్నే మా భవిష్యత్‌’లో భా­గంగా గ్రామ సర్పంచ్‌ గడిదేసి అనూష, వైఎసాస్‌ర్‌సీపీ నాయకుడు గడిదేసి రా­జు తదితరులు పెదపట్నంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివ­రిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో 85 ఏళ్ల వయ­సు కలిగిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుని ఇంటి వద్దకు వెళ్లగా... ఆ­యన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వైఎస్‌ జగన్‌ సీఎం అయి­న తర్వాత తమకు కలిగిన మే­లు­ను వివరిస్తూ ఆనందంతో కన్నీరుపెట్టారు.

Back to Top