మనసున్న మా రాజు @ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి త‌క్ష‌ణ స‌హాయం

కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన బాధిత కుటుంబాలు

పార్వతీపురం : మనసున్న మా రాజు అని ముఖ్య మంత్రి వై.య‌స్. జగన్ మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటనకు బుధ వారం విచ్చేసిన ముఖ్య మంత్రి కి అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులు, ఉపాధి కావాలని పలువురు యువత విన్నవించగా తక్షణం స్పందించి వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ముఖ్య మంత్రి స్పందనతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. 

వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గోపాలపురం గ్రామం నుండి సంపంగి దేవాన్ష్ (తల్లిదండ్రులు లక్ష్మీ సాయిరాం)  ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తూ అప్పలేసియా వ్యాధితో బాధపడుతున్నామని,  ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ క్రిందకు రావడంలేదని కేజీహెచ్ లో కొంతమేర చికిత్స పొందామని అనంతరం విజయనగరం వెంకట పద్మా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని పింఛను మంజూరు చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసి వెంటనే  చెక్కును అందజేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చెక్కును అందజేశారు.

 శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం జాడ గ్రామం నుండి వై గణేష్ (శంకర్రావు) రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మిజిల్స్ వైరస్ తో బాధపడుతున్నామని ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందడం జరిగిందని, తదుపరి చికిత్సను పొందుటకు తగు సహాయం చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయల నిధిని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేస్తూ వెంటనే అందించాలని ఆదేశించారు.

 విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరవల్లి గ్రామం నుండి బేత గగన దీపక్ (గణేష్) ఫిట్స్ తో బాధపడడం జరుగుతుందని తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ వెంటనే లక్ష రూపాయలను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల చేశారు. అధికారులకు తక్షణం అందించాలని ఆదేశించారు.

 పార్వతీపురం మండలం పార్వతిపురం పట్టణానికి చెందిన బేత హాసిని (శ్రీనివాసరావు) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నామని, చికిత్స పొందామని బెంగుళూరు పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సకు 3 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ 3 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల చేశారు. అధికారులు వెంటనే నిధులను చెక్కు అందజేశారు.

విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామం నుండి నారాయణరావు ముఖ్యమంత్రి కి ఆర్జేని సమర్పిస్తూ న్యూకోపోలీతో బాధపడుతున్నామని ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధి లేదని, బోన్ మారో చికిత్సకు ఆర్థిక సహాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేశారు. అధికారులు వెంటనే చెక్కును పంపిణీ చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లా బలిజి పేట మండలం మరువాడ గ్రామం నుండి పిల్లి లక్ష్మణరావు క్రింద దవడ ట్యూమర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియజేయగా ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేశారు దీన్ని అధికారులు వెంటనే పంపిణీ చేశారు.

పార్వతిపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి గ్రామం నుండి చోరీ లోకేష్ (రమణ) ముఖ్యమంత్రి కి గాచర్ వ్యాధి నుండి బాధపడుతున్నామని ఇప్పటికే రూ.1. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2023 జనవరిలో మంజూరు చేయడం జరిగిందని, పింఛను మరియు ఆర్థిక సహాయం ఇప్పించి ఎంజయిమ్ ను రీప్లేస్మెంట్ తెరాపి కొరకు సహాయ పడాలని కోరగా ముఖ్యమంత్రి లక్ష రూపాయలను మంజూరు చేసి చెక్కులను వెంటనే అందజేయాలని అధికారులు ఆదేశించారు.

 పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన మక్కువ జస్విత (శ్రీలక్ష్మి) కంజనీటల్ డిఫార్మటీ తో బాధపడుతున్నామని ఉత్తరప్రదేశ్ లో త్రిశల ఫౌండేషన్ లో చికిత్స పొందుటకు తగిన సహాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి లక్ష రూపాయలను మంజూరు చేసి వెంటనే అందించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు వెంటనే జిల్లా కలెక్టర్ అందజేశారు.

 పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం లక్నాపురం గ్రామానికి చెందిన ముదిలి గిరి వర్ధన్ (శ్రీధర్) ముఖ్యమంత్రి కి విన్నవిస్తూ హార్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేయగా వెంటనే స్పందించి లక్ష రూపాయల నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేశారు. అధికారులు వెంటనే చెక్కు రూపంలో అందించారు.

 పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట గ్రామం నుండి అలజంగి వెంకటేశ్వరరావు (లక్ష్మి) 90% వ అంగవైకల్యం కలిగే ఉన్నామని ఉపాధి కల్పించాలని కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ స్వయం ఉపాధికి కొరకు లక్ష రూపాయల నిధులను మంజూరు చేశారు.

 శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సూరంపేట గ్రామానికి చెందిన నజాన సురేష్ (సీతప్పడు) యాక్సిడెంట్ జరగడం, పోలియో కలిగి ఉండడం వలన ఉపాధి కల్పించాలని కోరగా స్వయం ఉపాధి కొరకు లక్ష రూపాయల నిధులను మంజూరు చేశారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోరాడ వీధికి చెందిన పిజిఎన్ శ్రీనివాస్ క్యాన్సర్ తో బాధపడుతున్నామని, ఇంటర్మీడియట్  చదవడం జరిగిందని ఉపాధి కల్పించాలని కోరగా స్వయం ఉపాధి కొరకు లక్ష రూపాయలు నిధులను మంజూరు చేశారు.

 విజయనగరం జిల్లా బొబ్బిలి పట్నం కోరాడ వీధికి చెందిన పి.బి శ్రీరామ్ క్యాన్సర్ తో బాధపడడం జరుగుతుందని తెలియజేయగా లక్ష రూపాయల నిధులను మంజూరు చేసారు. 

విజయనగరం జిల్లా రాజాం గ్రామానికి చెందిన పోసిన భవాని భూ తగాదాలు ఉన్నాయని, కొంతమంది వాటిని అడ్డుకుంటున్నారని తన కుమార్తె బీఫార్మసీ చదువుతుందని తెలియజేయగా ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేస్తూ తగాదాల నివారణకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తో మాట్లాడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు అవసరం మేరకు అవకాశం మేరకు ఫార్మసీ కంపెనీలో ఉద్యోగ నియామకానికి సాహాయ పడతామని తెలిపారు. వెంట‌నే స్పందించి ఆదుకున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు బాధిత కుటుంబాల స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 

Back to Top