మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైయ‌స్ జగన్‌

అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం, తక్షణ సాయం

శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైయ‌స్‌ జగన్‌  మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం అందేలా ఆదేశించారు. నౌపడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్‌కు వెళ్తున్న సమయంలో టెక్కలి మండలానికి చెందిన లాల్‌ పండా వెంకటరావు తన కుమారుడు కార్తీక్‌ (9) ‘తొసిల్‌­జు­మాబ్‌–సోజియా’ అనే ఎముకల వ్యాధితో ఆరేళ్లుగా బాధ పడుతు­న్నాడ­ని సీఎంకు చెప్పారు.

 వైద్య ఖర్చులకు ఇంటిని కూడా అమ్మేశానన్నారు. సీఎం స్పందిస్తూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, తక్షణ సాయంగా రూ.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠ్కర్‌ను ఆదేశించారు. వీరి విషయం ఫాలోఅప్‌ చేయాలని సీఎంవో కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు.

విజయనగరం జిల్లా సారథికి చెందిన వంజరాపు రామ్మూర్తి కుమారుడు రవికుమార్‌ (33) ఊపిరితిత్తుల వ్యాధి వల్ల ఆక్సిజన్‌ సిలెండర్ల మీదే బతుకుతున్నాడని స్థానిక సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థ బాధితుని తరఫున సీఎంను కోరారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందివ్వాలని, ప్రతి నెలా రూ.10 వేలు íపింఛన్‌ మంజూరు చేసేలా విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని ఆదేశించాలని సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. బాధితులు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top