కాసేపట్లో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

తాడేప‌ల్లి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం వైయ‌స్  జగన్‌ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సా­మ­గ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్‌మెంట్‌ చే­య­నున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు.

 సీఎంగా వైయ‌స్‌ జగన్‌ బాధ్య­తలు స్వీకరించిన త­ర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉ­చి­తంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సి­మెంట్, స్టీలు, మెటల్‌ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.­40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.­2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు.

 దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ­తో రుణాలు ఇస్తున్నాయి.

Back to Top