ప్రతి ఇంటికి సంక్షేమం.. వైయ‌స్ఆర్‌సీపీతోనే సాధ్యం

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి గెలిపించండి

ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్,ఎంపీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు),

సంతకవిటి మండలంలో మండాకురిటి గ్రామంలో కొనసాగుతున్న ‘ఇంటింటికీ వైయ‌స్ఆర్‌సీపీ’ ఎన్నికలు ప్రచార కార్యక్రమం.

విజయనగరం జిల్లా : ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే మరోసారి వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్, విజయనగరం జిల్లా పార్లమెంట్‌ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మంగళవారం సంతకవిటి మండలంలో మండాకురిటి గ్రామంలో ‘ఇంటింటికీ వైయ‌స్ఆర్‌సీపీ’ ఎన్నికలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్, విజయనగరం జిల్లా పార్లమెంట్‌ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) లకు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలతో సత్కరిస్తూ.. హారతులు పట్టి స్వాగతించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ పంపిణీ చేశారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని తెలియజేశారు. మళ్లీ అలాంటి పరిస్థితే ఉండాలంటే ఫ్యాన్‌ గుర్తుకు రెండు ఓట్లు వేసి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. గతంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపై సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉందని, కానీ నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా గడప వద్దకే పరిపాలన తీసుకొచ్చామన్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. రహదారులు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టామని.. మరోసారి వైయ‌స్ఆర్‌సీపీని గెలిపిస్తే రాజాం అసెంబ్లీ మరింత అభివృద్ధి పథంలో వెళ్తుందని తెలిపారు.

కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ మోహన్ రావు,స్థానిక సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరుగుబిల్లి స్వామినాయుడు, మండల జె.సి.ఎస్ కన్వీనర్ రాగోలు రమేష్, సిరిపురపు సర్పంచ్ డోల తిరుపతి రావు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండ్రేటి కేసరి,వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు,మండల పరిధిలోని సర్పంచులు ఎంపీటీసీలు, వైయస్సార్ సీపీ ముఖ్య నేతలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కమిటీ సభ్యులు, మాజీ గ్రామ వాలంటీర్లు, సోషల్ మీడియా కన్వీనర్లు, స్థానికులు, మహిళలు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top