కాసేపట్లో ఏలూరుకు వైయస్‌ జగన్‌

గన్నవరం ఎయిర్‌పోర్టులో జననేతకు ఘనస్వాగతం

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో జననేతకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో వైయస్‌ జగన్‌ ఏలూరులోని బీసీ గర్జన సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. సభా ప్రాంగణానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంగా నామకరణం చేశారు. బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. వైయస్‌ జగన్‌ నియమించిన బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఆ నివేదికను కమిటీ జననేతకు అందజేసిన విషయం తెలిసిందే. బీసీల జీవన ప్రమాణాలు మార్చేందుకు వైయస్‌ జగన్‌ గర్జన సభా వేదిక నుంచి డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. బీసీ గర్జనకు 13 జిల్లాల నుంచి బీసీ సంఘాల నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. 

Back to Top