సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ నూతన చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ క‌లిశారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక‌లో ప‌ద్మ‌శ్రీ ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌డం ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆమెను అభినందించారు. త‌న‌కు జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌గా అవ‌కాశం క‌ల్పించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గంటా ప‌ద్మ‌శ్రీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, గంటా పద్మశ్రీ కుటుంబ సభ్యులు ఉన్నారు.
 

Back to Top