శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా

నామినేషన్‌ దాఖలు.. నేడు ఎన్నిక

తొలిసారి మైనారిటీ మహిళకు డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి

అమరావతి : శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కనుంది. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ ఈ పదవికి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం  డిప్యూటీ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగనుంది. దీంతో శుక్రవారమే ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జకియా ఖానమ్‌ను మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలపై సీఎం  వైయ‌స్ జగన్‌కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు.

జకియా ఖానమ్‌ నేపథ్యమిది.. 
పేరు: మయాన జకియా ఖానమ్‌ 
భర్త: దివంగత ఎం.అఫ్జల్‌ ఖాన్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ 
సంతానం: ముగ్గురు కుమార్తెలు, 
ఒక కుమారుడు 
చదువు: ఇంటర్మీడియెట్‌ 
పుట్టిన తేది: జనవరి 01, 1971 
స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్‌ జిల్లా 
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి)

తాజా ఫోటోలు

Back to Top