కొంచమైన పాపభీతి ఉండాలి..లోకేష్‌ తప్పు తెలుసుకో..

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
 

చిత్తూరు: అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేసే నారా లోకేష్‌కు కొంచమైన పాపభీతి ఉండాలని, తనపై చేసిన ఆరోపణలు తప్పు అని తెలుసుకోవాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఒక సారి టీటీడీ ఛైర్మన్‌ హాజరు కావటం ఆనవాయితీ. నేనూ అలాగే వెళ్లాను. నా తల్లిగారు, నా సతీమణి తప్ప బంధువులు ఎవ్వరూ లేరు. ఫొటోలో ఉన్నది అందరూ టీటీడీ ఉద్యోగులు.నీ ట్వీట్ అబద్ధం. కొంచమైనా పాపభీతి ఉండాలి.తప్పు తెల్సుకో అంటూ సుబ్బారెడ్డి ట్వీట్‌ చేశారు.

Back to Top