జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదు

వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

అనకాపల్లి: జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పవన్‌లా మాది ప్యాకేజీ పార్టీ కాదు..మాది పేదల పక్షాన నిలిచే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని తెలిపారు. శనివారం అనకాపల్లి జిల్లా పెందుర్తిలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. షూటింగ్‌ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్‌కు ప్రజల కోసం పోరాటం చేసే వైయస్‌ఆర్‌సీపీకి చాలా తేడా ఉందన్నారు. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా వైయస్‌ జగనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్‌కు అభివృద్ధి గురించి తెలుస్తుందని ప్రశ్నించారు. బీసీలను పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదని తేల్చి చెప్పారు. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని నిలదీశారు. బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా అని వైవీ సుబ్బారెడ్డి సవాలు విసిరారు. అధికారంలోకి వస్తానని పవన్‌ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
 

Back to Top