సంక్రాంతి వేడుకల్లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

ప్రకాశం : టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తన స్వగ్రామమైన మేదరమెట్లలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  తన ఇంటివద్ద భోగిమంటలు వేసి అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్‌ దయాల్‌ శ్రవణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 400 మందికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి సంబంధించిన శస్త్ర చికిత్సలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తుచేశారు. సంక్రాంతికి ప్రతి ఏటా స్వగ్రామంలో గడపటం ఆనందానిస్తోందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మేదరమెట్లలో టీటీడీ కళ్యాణమంటపం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు.  

Back to Top