‘శ్రీవారికి ప్రథమ సేవకుడిగా అవకాశం.. నా పూర్వజన్మ అదృష్టం’

టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రథమ సేవకుడిగా రెండో సారి అవకాశం రావడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి  అన్నారు. 
బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడూతూ.. గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ.. మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడంలో విజయవంతం అయ్యామని అన్నారు.

తిరుమలలో చారిత్రాత్మక నిర్ణయాలు, మార్పులు తీసుకు రావడంతో పాటు వాటిని అమలు చేసామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇబ్బందులకు గురి అవుతున్న సమయంలో దర్శనాలు‌ కూడా కుదించాల్సి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసి పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top