ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి వ‌చ్చినా ప‌ర్వాలేదు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి పోటీ చేసినా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే బ‌రిలో నిలుస్తుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  2024లో అన్ని పార్టీలు వ‌ర్సెస్ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు. అయోమయంలో ఉన్న హైనాలు వర్సెస్ సింహం. 0+0 ఇప్పటికీ 0 కాబట్టి ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా పర్వాలేదు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మొత్తం 175 గెలుస్తుంద‌ని ట్వీట్ చేశారు.

  ప్రజా సంకల్ప యాత్రకు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. 3,648 కి.మీ, 341 రోజులు, 2 కోట్ల మంది ప్రజలు ఒక గమ్యస్థాన నాయకుడిని కలిశారు. వైయ‌స్ జగన్ గారు ఆంధ్రాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చేందుకు నిజాయితీగా ప్రతి రోజూ కష్టపడుతున్నారని మ‌రో ట్వీట్ చేశారు.

 డబ్బు కొట్టు-ఓటు పట్టు 
ఓటర్లను కొనేందుకు 1996లోనే 500 నోట్లను వెదజల్లి ప్రజాస్వామ్యానికి శనిలా దాపురించాడు చంద్రం. నంద్యాల ఉపఎన్నికల్లో ఓటుకు 5 వేలు సమస్యే కాదని ప్రకటించి, పంపిణీ చేశాడు. ఇప్పుడు అదే బెంచ్ మార్క్ అయింది. డబ్బు కొట్టు-ఓటు పట్టు నినాదానికి ఆద్యుడు చంద్రం అంటూ తాజాగా విజ‌య‌సాయిరెడ్డి ఇంకో ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top