శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో వైయ‌స్‌ జగన్‌ సమావేశం 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైయ‌స్‌ జగన్‌తో సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డిశాంతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇదే సమయంలో భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలకు వైయ‌స్‌  జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. 

Back to Top