అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడు తూర్పు నియోక‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త  దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌:   రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింద‌ని, అభివృద్ధిపై చంద్రబాబు చ‌ర్చ‌కు వ‌చ్చినా మేం రెడీగా ఉన్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడు తూర్పు నియోక‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త  దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విజ‌య‌వాడ తూర్పు నియోజకర్గంలోనే రూ.650 కోట్ల అభివృద్ది జరిగింద‌ని అవినాష్ చెప్పారు. కొండ ప్రాంతాలు..కరకట్ట ప్రాంతం ఏంతో అభివృద్ది చేశామ‌ని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ప్రజలకు అండగా నిలిచామ‌ని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ అభివృద్ధీ చేయలేదని మండిప‌డ్డారు. గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కుతున్నార‌ని, సీఎం వైయ‌స్ జగన్ ...దేవినేని నెహ్రూ పై దిగజారి విమర్శలు చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి సంక్షేమం పై గద్దె రామ్మోహన్ చర్చకు రావాల‌ని స‌వాలు విసిరారు. గద్దె తూర్పులో ఏం అభివృద్ది చేశాడో చెప్పాల‌ని డిమాండు చేశారు. సెటిల్మెంట్ వారసుడు అని నా పై నోరుపారేసుకోవడం మానుకోవాల‌ని అవినాష్ హెచ్చ‌రించారు. మేము చేసిన అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం ..70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి వణికిపోతున్నారు. 
జీరో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ వ్యానులో గంజాయి తీసుకెళ్లింది టీడీపీ నేతలే  ..కాల్ మనీ సెక్స్ రాకెట్, కాల్ నాగ్ అంటే గుర్తొచ్చేది గద్దె రామ్మోహన్ అన్నారు. గద్దె భండారం త్వరలోనే బయటపెడతామ‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సిద్ధం సభలు చూసి టీడీపి శ్రేణులు, దాని మిత్ర పక్షాలుకి మైండ్ బ్లాక్ అయిందని అన్నారు.  నారా లోకేష్ అతనికి ఉన్న ఆస్తుల పై వివరణ ఇవ్వాలి.చంద్రబాబు అక్రమ ఆస్తులు పేదలకు పంచాల‌ని దేవినేని అవినాష్ డిమాండు చేశారు.

Back to Top