ఓటమి భయంతో టీడీపీ దిగజారుడు రాజకీయం

రాణిగారితోటలో టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్‌

ప్రజాదరణ చూసి ఓర్వలేక వలంటీర్లు, వైయస్‌ఆర్‌ సీపీ మహిళా నేతలపై దూషణలు

టీడీపీ నీచ రాజకీయాలపై దేవినేని అవినాష్‌ ఆగ్రహం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, టీడీపీ నేతలు ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నారని, ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ పక్షాన నిలుస్తున్నారని అబద్ధపు ప్రచారాలకు తెరతీస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ధ్వజమెత్తారు. విజయవాడ రాణిగారితోటలో టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్‌పై దేవినేని అవినాష్‌ తీవ్రంగా మండిపడ్డారు. తన పర్యటనలో టీడీపీ మహిళా కార్యకర్తలు గొడవ సృష్టించే ప్రయత్నం చేశారని, వలంటీర్లపై దాడి, వైయస్‌ఆర్‌ సీపీ మహిళా నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. 

గత ఐదు సంవత్సరాలు రిటైనింగ్‌ వాల్‌ కట్టకుండా టీడీపీ కాలక్షేపం చేసిందని, వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రిటైనింగ్‌ వాల్‌ పూర్తి చేసి.. రాణిగారితోట వాసులకు ముంపు కష్టాలు లేకుండా చేశామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న కాస్తో.. కూస్తో బలం మొత్తం వైయస్‌ఆర్‌ సీపీ పక్షాన నిలుస్తోందనే కోపంతో టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, గొడవలు సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని దేవినేని అవినాష్‌ ధ్వజమెత్తారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్న తమను రెచ్చగొట్టే విధంగా అసభ్యకరంగా ప్రవర్తించారని, అయినా ఎక్కడా సహనం కోల్పోకుండా వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పామన్నారు. టీడీపీ కార్యకర్తలకు సైతం ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. 

వలంటీర్లు, గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళలను కించపరిచేలా అసభ్యపదజాలంతో టీడీపీ నేతలు మాట్లాడారని, కులం పేరుతో ఒక మహిళను కించపరిచేలా ఓ వ్యక్తి మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉన్నారని ఓర్వలేక నీచ రాజకీయాలకు టీడీపీ తెరదీసిందన్నారు. టీడీపీకి, గద్దె రామ్మోహన్‌కి ఓటమి భయం పట్టుకుందని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.  

 

Back to Top