తాడేపల్లి: టీడీపీ కూటమి నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఒకవైపు వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆస్తులు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. టీడీపీ మూకల దౌర్జన్యాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ క్రమంలో కూటమి నేతల అరాచకాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయంటూ వైయస్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది. ‘‘నిన్నటికి నిన్న టీడీపీ నేతల వేధింపులు భరించలేక అనకాపల్లిలో గొల్లవిల్లి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. ఈ రోజు అదే అనకాపల్లిలో వైయస్ఆర్‌సీపీకి ఓటు వేశారన్న కక్షతో జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మనుషులం అంటూ వచ్చి జేసీబీతో ఒకరి ఇంటిని కూల్చేశారు. అప్పులు చేసుకుని ఇంటిని కట్టుకుంటే ఇలా కూల్చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలు ఇంకెన్ని రోజులు చంద్రబాబు? పవన్ కళ్యాణ్? హోంమంత్రి అనిత?’ అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైయస్ఆర్‌సీపీ మండిపడింది.