ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర‌స్థాయి ప్లీన‌రీ స‌మావేశాలు

ప్లీన‌రీ ఏర్పాట్ల‌పై కేంద్ర కార్యాల‌యంలో విస్తృత స్థాయి స‌మావేశం

తాడేపల్లి :  వ‌చ్చే నెల 8, 9వ తేదీల్లో నిర్వ‌హించే వైయ‌స్ఆర్‌సీపీ మూడో ప్లీనరీ సమావేశాలను పార్టీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయవాడ–గుంటూరు మధ్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాలమైన మైదానంలో ప్లీనరీ నిర్వహించడానికి ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. ప్లీన‌రీ ఏర్పాట్ల‌పై గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి జోగిర‌మేష్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.  జులై 8, 9 వ తేదీన జరగనున్న రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశం కొరకు జరుగుతున్న ఏర్పాట్లుపై చ‌ర్చించారు.  ప్లీనరీకి విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సూచించారు.  ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9న ప్లీనరీ నిర్వహిస్తున్నాం. మళ్లీ ఐదేళ్ల తర్వాత 2027లో కూడా అధికారంలో ఉండే పార్టీగా ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించుకుంటాం. పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడిచి విజయం సాధించడమే మా సిద్ధాంతమ‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 

Back to Top