పల్లెల్లో మార్మోగిన జగన్నినాదం

తొలి విడత పంచాయతీ ఎన్నిక‌ల్లో వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారుల విజయం

పల్లెల్లో వైయస్‌ఆర్‌సీపీ అభిమానుల సంబరాలు 

81.25 శాతం పంచాయతీల్లో అధికారపార్టీ అభిమానులు గెలుపు

తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. పల్లెపల్లెన జగన్నినాదం మార్మోగింది. సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వానికి ప్రజలు మరింత బలం చేకూర్చారు. వైయస్‌ఆర్‌ సీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికి.. భారీ విజయాన్ని అందించారు. పల్లెల్లో పార్టీ అభిమానుల ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. తొలి విడత పంచాయతీ ఫలితాల మాదిరిగానే రెండు, మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

తొలిదశలో 12 జిల్లాల పరిధిలోని 3,249 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా 525 చోట్ల సర్పంచులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో 90 శాతం వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు ఉన్నారు. ఏకగ్రీవాలు మినహా 2,724 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 2,721 పంచాయతీల్లో పోలింగ్‌ జరిగింది. 

శ్రీకాకుళం జిల్లాలో ఓ పంచాయతీలో ఎవరూ నామినేషన్‌ వేయనందున, నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంవల్ల పోలింగ్‌ జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సర్పంచి అభ్యర్థి బ్యాలెట్‌ బాక్సు ఎత్తుకుపోవడంవల్ల పోలింగ్‌ నిలిచిపోయింది. ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు/రీపోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. 

ఏకగ్రీవాలతో కలిపి మిగిలిన 3,246 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఏకగ్రీవాలతో కలిపి 2,640 మంది వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు  సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 81.25 శాతం పంచాయతీల పాలనాధికారాలను ప్రజలు అధికారపార్టీ అభిమానులకు అప్పగించారు. 510 గ్రామాల్లో మాత్రమే టీడీపీ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. టీడీపీ 15.66 శాతం పంచాయతీలకే పరిమితమైంది. 

జిల్లాల వారీగా గ్రామపంచాయతీ ఫలితాలివే..

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top