ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఎల్లోమీడియా తప్పుడు రాతలు

అబద్ధాలను అచ్చేయడమే ఈనాడు పనిగా పెట్టుకుంది

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి  ఫైర్‌

కూటమి ప్రభుత్వంలోనే యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్‌

ఎక్కడా తగిన చెక్‌పోస్ట్‌లు, తనిఖీలు లేనే లేవు

ఎర్రచందనం తరలించే వారిపై చర్యలు శూన్యం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆ దిశలో పటిష్ట చర్యలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై అప్పటి ప్రభుత్వం ఉక్కుపాదం

పీడీ యాక్ట్‌తో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించిన వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం

నాడు మంత్రి పెద్దిరెడ్డి హయాంలోనూ పలు చర్యలు

స్వాతంత్య్రానంతరం తొలిసారి 24 ఫారెస్ట్‌ రేంజ్‌ల గుర్తింపు

ప్రతి రేంజ్‌కు ప్రత్యేకంగా డీఎఫ్‌ఓ. నలుగురు ఆర్మ్‌ డ్‌ సిబ్బంది 

ఏకంగా 370 కొత్త వాహనాలతో కట్టుదిట్టమైన గస్తీ

ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనానికి వేలం

ఆదాయంలో రాష్ట్రానికి 60 వచ్చేలా అవగాహన: పుత్తా శివశంకర్‌రెడ్డి వెల్లడి

చంద్రబాబు హయాంలో స్మగ్లర్లపై కేసులు లేవు

తెలుగుదేశం నేతలుగా చెలామణి అయిన స్మగ్లర్లు

ఏకంగా హెరిటేజ్‌ వాహనాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌

కర్నూలు జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత స్మగ్లర్‌

ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాతగా ఎదిగాడు

తాను పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ కూడా స్మగ్లర్‌

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆమె పట్టుబడింది

చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ ఆనవాళ్లు

అక్కడ ఎర్రచందనం దిమ్మెలు పట్టుబడ్డాయి

క్లిప్పింగ్స్‌తో సహా చూపిన శివశంకర్‌రెడ్డి

అప్పటి  స్మగ్లింగ్‌ ఈనాడుకు కనిపించడం లేదు

వైయస్ఆర్‌సీపీపై బురద చల్లడమే ఆ పత్రిక పని

ఆ పత్రికలో కథనాలు. వెంటనే టీడీపీ ఆరోపణలు

అంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్న కుట్ర

అందులో భాగమే ఈనాడు తాజా కథనం

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల్లోనే పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా, వైయస్ఆర్‌సీపీ లక్ష్యంగా ఈనాడులో ఒక అబద్ధపు కథనం రాయించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ రెడ్డి మండిపడ్డారు. నిజానికి ఎర్ర చంద్రనం స్మగ్లింగ్‌ అంటే ఎవరికైనా టీడీపీ గుర్తుకొస్తుందని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ పాల వ్యాన్లలోనే ఆనాడు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేసిన ఘనత వారి సొంతమని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి  సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.
 
కోట్లు దండుకున్నారు:
– ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దండుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులదే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంతూరు నారావారిపల్లెలోనే ఎర్రచందనం దుంగలు పట్టుబడిన విషయం మర్చిపోయారా?.
– చంద్రబాబుకు తెలియకుండానే అక్కడ ఎర్రచందనాన్ని నిల్వ చేశారా?. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, దానిపై ఆనాడు ఆయనేం చర్యలు తీసుకున్నారు?. ఎవరిపై కేసులు పెట్టారు?
– ఇంకా ఆనాడు చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌కు చెందిన పాల వ్యాన్‌లలోనే ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డారు.
– ఇవన్నీ మేం చేస్తున్న ఆరోపణలు కావు. ఆనాడు పత్రికల్లో పెద్ద ఎత్తున దీనిపై కథనాలు ప్రచురితం అయ్యాయి.

టీడీపీ నేతలే స్మగ్లర్లు:
– నాడు చంద్రబాబు హయాంలో కొందరు టీడీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లర్లుగా మారి పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లా చాగల్లు మండల పరిషత్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలీ, అప్పటి ప్రభుత్వంలోని పర్యాటక శాఖ మంత్రికి ముఖ్య అనుచరుడు.
– ఆయన పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ ఆర్జించిన సొమ్ముతో తరువాత సినిమా నిర్మాతగా మారాడు. తన సినిమాలో నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఆమె కూడా అదే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో భాగస్వామిగా మారి పట్టుబడింది.
– ఇదీదీ టీడీపీ నేతలకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ఉన్న అనుబంధానికి ప్రత్యక్ష నిదర్శనం. 

గత ప్రభుత్వంలో కఠిన చర్యలు:
– వైయస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఏకంగా పీడీ యాక్ట్‌ పెట్టి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. 
– ఆనాడు అటవీశాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనంపై, అప్పుడు అటవీ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా ఉన్న, ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
– ఆ కమిటీ పొరుగు రాష్ట్రాల అటవీశాఖ అధికారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి.. ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని చట్ట ప్రకారం వేలం వేసి, అందులో రాష్ట్రానికి అరవై శాతం ఆదాయాన్ని ఇచ్చేలా అవగాహనకు వచ్చింది.
– అంతే కాదు, నాడు వైయస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా అటవీ శాఖ మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎవరూ చేయని విధంగా మొదటిసారి శేషాచలం అటవీ ప్రాంతంలో 24 ఫారెస్ట్‌ రేంజ్‌లను గుర్తించి 24 మంది డిఎఫ్‌ఓలను నియమించడంతో పాటు, వారికి వన్‌ ప్లస్‌ ఫోర్‌ ఆర్మ్‌డ్‌ సిబ్బందిని కేటాయించారు.
– అప్పటి వరకు పనికిరాని వాహనాలతో స్మగ్లర్లతో పోటీ పడలేక ఉసూరుమంటున్న అటవీ శాఖకు ఏకంగా 370 అత్యాధునిక వాహనాలను అందించారు. 

కేసులు.. స్వాధీనం.. వాస్తవాలు:
– టీడీపీ ప్రభుత్వ హయాంలో అంతు లేకుండా ఎర్ర చందనం అక్రమ రవాణా జరిగింది. ఏనుగు యథేచ్ఛగా వెళ్లిపోతుంటే.. చూస్తూ ఊర్కొని కలుగులో ఎలుకను పట్టుకున్నట్లు.. అక్కడో ఇక్కడో కొంత ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.
– ఆ గణాంకాలు చెబుతూ.. గత టీడీపీ ప్రభుత్వం, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాల హయాంలో కేసులను, స్వాధీనం చేసుకున్న సరుకు తదితర వివరాలు ఎల్లో మీడియాలో ప్రస్తావించారు.
– నిజం చెప్పాలంటే.. ఆనాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో అంతులేని విధంగా స్మగ్లింగ్‌ కొనసాగింది. రికార్డుల్లో రాసుకోవడం కోసం అక్కడక్కడ వాటిని స్వాథీనం చేసుకున్నారు. అందుకే ఆ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
– అదే, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను చాలావరకు నియంత్రిండం వల్ల, స్మగ్లర్ల ఆటలు సాగలేదు. అందుకే నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న సరుకు తక్కువగా ఉంది. ఇది వాస్తవం.
– వైయ‌స్ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు, టాస్క్‌ ఫోర్స్‌ తనిఖీలు జరపడం వల్ల ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పగ్గాలు వేసినట్లైంది. అందుకే, అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి తక్కువ కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన సరుకు కూడా తక్కువే.

ఆ ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారు పవన్‌?:
– డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని నేపాల్‌కు ఎర్రచందనం తరిలిపోయిందని ఆరోపించారు.
– మరి అటవీశాఖను కూడా నిర్వహిస్తున్న మంత్రిగా ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? నిజంగా నేపాల్‌కు తరలిపోతే ఎందుకు దానిపై కేసులు నమోదు చేయలేదు?.
– అందుకే, ఎన్నికల హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం ఇదంతా.. అని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top