బూత్ స్థాయి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలి

వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర కార్యదర్శి (కోఆర్డినేషన్) పుత్తా శివ‌శంక‌ర్‌

 నెల్లూరు రూరల్‌లో బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్‌ శిక్షణ

నెల్లూరు జిల్లా: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి బూత్ స్థాయి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (కోఆర్డినేషన్) పుత్తా శివ‌శంక‌ర్‌ సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆనంద విజ‌య‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision) ప్రక్రియపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.  ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కోఆర్డినేషన్) పుత్తా శివ‌శంక‌ర్‌ బీఎల్‌ఏలకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఓట్లు ఒక్కటి కూడా పోకుండా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన నకిలీ, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే దిశగా అధికారులకు ఫారం-7 దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు. ఒక్క ఓటు కూడా పోకుండా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాల‌ని ఆనం విజయకుమార్‌రెడ్డి సూచించారు.


 

Back to Top